Teenz OTT: దెయ్యాన్ని వెతుకుతూ వెళ్లిన టీనేజర్స్.. ఊహించని ట్విస్టులతో అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో చూడొచ్చంటే..

తాజాగా ఇప్పుడు మరో అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఆ సినిమా ఇప్పుడు ఓటీటీ లవర్స్ కు అందుబాటులో ఉంది. ఆ సినిమా పేరు టీన్స్. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది

Teenz OTT: దెయ్యాన్ని వెతుకుతూ వెళ్లిన టీనేజర్స్.. ఊహించని ట్విస్టులతో అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో చూడొచ్చంటే..
Teenz
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2024 | 4:07 PM

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో హారర్ కంటెంట్‏కు కొదవ లేదు. నిత్యం కొత్త కొత్త చిత్రాలు డిజిటల్ సినీ ప్రియుల ముందుకు వస్తున్నాయి. క్రైమ్, హారర్, అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు ఓటీటీలో విడుదలైన హారర్ థ్రిల్లర్, మర్డరీ మిస్టరీ చిత్రాలకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఆ సినిమా ఇప్పుడు ఓటీటీ లవర్స్ కు అందుబాటులో ఉంది. ఆ సినిమా పేరు టీన్స్. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

టీన్స్.. జూలై 12న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. సరిగ్గా రెండు నెలల తర్వాత సెప్టెంబర్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అసలు సినిమా కథను కూడా చెప్పేసింది సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్. “13 మంది టీనేజర్స్ తమ క్లాస్ కు బంక్ కొట్టి బయటకు వెళ్లాలని అనుకుంటారు. కానీ ఆ నిర్ణయమే వాళ్లను ఎప్పుడూ ఊహించనంత ప్రమాదంలోకి నెట్టేస్తుంది. టీన్స్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది” అంటూ ట్వీట్ చేసింది.

కోలీవుడ్ డైరెక్టర్ పార్తిబన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యువ నటీనటులు కనిపించారు. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ మూవీలో యోగి బాబు అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 8 మంది అబ్బాయిలు, 5 అమ్మాయిలు స్కూల్ ఎగ్గొట్టి బయటకు వెళ్తారు. ఓ ఊరిలో దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఆ విషయాన్ని తెలుసుకోవాలని ఆ ఊరు వెళ్తారు. ఆ తర్వాత వారిలో ఒక్కొక్కరు మిస్ అవుతుంటారు. చివరకు వాళ్లందరూ ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నారు..? అసలు ఏం జరిగిందనేది కథ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.