AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar : అజిత్‌తో ప్రశాంత్ నీల్ భారీ సినిమా.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కేజీఎఫ్ అన్ని భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ప్రభాస్ తో సలార్ సినిమా చేసి భారీ హిట్ అందుకున్నాడు ప్రశాంత్. ఇక ఇప్పుడు అజిత్ తో ఈ స్టార్ డైరెక్టర్ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే అజిత్ , ప్రశాంత్ నీల్ ను కలిశారు. దాంతో ఈ ఇద్దరూ కలిసి ఓ భారీ సినిమా చేస్తున్నారంటూ టాక్ వినిపిస్తుంది.

Ajith Kumar : అజిత్‌తో ప్రశాంత్ నీల్ భారీ సినిమా.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్
Ajith
Rajeev Rayala
|

Updated on: Jul 26, 2024 | 6:51 PM

Share

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ప్రశాంత్ నీల్ పేరు మారు మ్రోగింది. యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కేజీఎఫ్ అన్ని భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ప్రభాస్ తో సలార్ సినిమా చేసి భారీ హిట్ అందుకున్నాడు ప్రశాంత్. ఇక ఇప్పుడు అజిత్ తో ఈ స్టార్ డైరెక్టర్ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే అజిత్ , ప్రశాంత్ నీల్ ను కలిశారు. దాంతో ఈ ఇద్దరూ కలిసి ఓ భారీ సినిమా చేస్తున్నారంటూ టాక్ వినిపిస్తుంది. ఈ వార్త విన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చింది.

ఇది కూడా చదవండి : Tamannaah: అమ్మబాబోయ్..! తమన్నా ఇరగదీసిందిగా.. ఈ సాంగ్ చూస్తే పిచ్చెక్కాల్సిందే

కొద్దిరోజుల క్రితం అజిత్ కుమార్, ప్రశాంత్ నీల్ కలవడమే ఈ వార్తలకు కారణం. అవును, ఈ ఇద్దరు సెలబ్రిటీలు ఇటీవల కలుసుకున్నారు. అయితే ఆ భేటీలో కలిసి సినిమా తీయడంపై ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. ఇప్పట్లో వీరిద్దరు కలిసి సినిమా చేసే ఆలోచన లేదట. ఈ భేటీలో అజిత్, ప్రశాంత్ ఒకరినొకరు ప్రశంసించుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా మేకింగ్ విషయంలో అజిత్ కుమార్, ప్రశాంత్ నీల్ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర స్టేట్ మెంట్ ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఈ స్టార్ హీరో ఎంట్రీ పక్క అంటగా..!

ప్రశాంత్ నీల్ తో అజిత్ కుమార్ కొత్త సినిమా చేయబోతున్నాడని, ఆ సినిమా కథ ‘కేజీఎఫ్ 2’తో లింక్ అవుతుందని అలాగే ఈ చిత్రాన్ని విజయ్ కిర్గందూర్ నిర్మిస్తారని గాసిప్ స్ప్రెడ్ అయింది. దాంతో అభిమానులు చాలా సంతోషించారు. అయితే ఇప్పుడు అజిత్, ప్రశాంత్ నీల్ కలిసి సినిమా చేయడం లేదని నటుడి మేనేజర్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు నిరాశవ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ 2 పనుల్లో ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. అటు అజిత్ గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ అనే సినిమా చేస్తున్నాడు. దానితో పాటు మరో సినిమా షూటింగ్ ను ఇటీవలే పూర్తి చేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us