AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుమ్మడికాయ లడ్డు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోలేరు

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, నిత్యం ఇంటిలో పూజ చేస్తూ అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తుంటారు. ఇక దీని కోసం మహిళలు ప్రతి రోజూ కొత్తరకం స్వీట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. కాగా, ఇప్పుడు మనం ఎప్పుడూ చేసుకునే విధానం కాకుండా కాస్త కొత్తగా గుమ్మడికాయ లడ్డు రుచికరంగా ఎలా చేయాలో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Aug 13, 2026 | 3:10 PM

Share
గుమ్మడికాయతో చాలా మంది అనేక రకాల వంటలు చేసుకొని ఉంటారు. కానీ ఎప్పుడూ తినే విధంగా కాకుండా ఇలా గుమ్మడికాయతో లడ్డూ చేసి  తింటే, ఆ రుచి జన్మలో మర్చిపోలేరంట.  అంతే కాకుండా నైవేద్యం పెట్టడానికి కూడా ఇది చాలా బెస్ట్. మరి దీనిని ఎలా తయారు చేస్తారు అంటే?

1 / 5
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే..గుమ్మడిగా 200 గ్రాములు, కొబ్బరి పొడి ఒక కప్పు, నెయ్యి రెండు నుంచి మూడు టీ స్పూన్స్, పంచదార కప్పు, పాలు లీటర్, డ్రై ఫ్రూట్స్ ఆఫ్ కప్పు, యాలకుల పొడి వన్ టీ స్పూన్.

2 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. లడ్డూ తయారీ కోసం ముందుగా మీరు గుమ్మడికాయ తీసుకోవాలి. దీనిని మంచిగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకోవాలి. అందులో రెండు నుంచి మూడు టీ స్పూన్ల నెయ్యి వేసి, గుమ్మడికాయ తురుమును మంచిగా వేయించుకోవాలి.

3 / 5
ఇప్పుడు మరొకవైపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో పాలు పోసి, బాగా మరగబెట్టాలి. అవి బాగా వేడి అయ్యి, చిక్కబడిన తర్వాత అందులో వేయించి పెట్టుకున్న గుమ్మడికాయ తురుము వేసి మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్, కొబ్బరితురుము, యాలకుల పొడి చక్కెర అన్నీ వేసి మంచిగా ఉడికించుకోవాలి.

4 / 5
ఈ మిశ్రమం చల్లారే వరకు చూడాలి. పూర్తిగా చల్లారకుండా గోరు వెచ్చగా ఉన్న సమయంలో వీటిని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ గుమ్మడికాయ లడ్డూలు రెడీ. ఇలా చేసి గనుక మీ కుటుంబ సభ్యులకు ఇస్తే వాళ్లు రుచికి ఫిదా అవ్వడం ఖాయం. మరి  మీరు కూడా ట్రై చేయండి.

5 / 5
Follow Us