AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తల్లి చనిపోయారని తెలిసినా షూటింగ్‌ కొనసాగించింది.. టాలీవుడ్ హీరోయిన్‌ డెడికేషన్ పై సర్వత్రా ప్రశంసలు

సాధారణంగా తల్లి/ తండ్రి లేదా ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఆ విషాదం నుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. నిత్యం వారి ఆలోచనలు, జ్ఞాపకాలే వెంటాడుతుంటాయి. ఏ పని చేయాలన్నా మనసును లగ్నం చేయలేం. కానీ ఈ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం తల్లి చనిపోయారని వార్త విన్నా షూటింగ్ కొనసాగించింది

Tollywood: తల్లి చనిపోయారని తెలిసినా షూటింగ్‌ కొనసాగించింది.. టాలీవుడ్ హీరోయిన్‌ డెడికేషన్ పై సర్వత్రా ప్రశంసలు
Tollywood Actress
Basha Shek
|

Updated on: Aug 13, 2026 | 3:13 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న లేటెస్ట్ సినిమా విశ్వనాథం అండ్ సన్స్. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీలో మలయాళం హీరోయిన్ మమితా బైజు కథానాయికగా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక శరత్ కుమార్, రవీనాటాండన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న విశ్వనాథం అండ్ సన్స్ ఆగస్టు 14న తమిళం, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే రాధికా శరత్ కుమార్ తల్లి చనిపోయారని వార్త వచ్చిందంట. సాధారణంగా ఇలాంటి వార్తలు వస్తే వెంటనే షూటింగ్ కు ప్యాకప్ చెప్పేసి వెళ్లిపోతారు. కానీ రాధిక మాత్రం అలా చేయలేదట. తల్లి లేదన్న బాధను దిగమింగుతూనే కెమెరా ముందుకు వచ్చి తన సీన్స్ కంప్లీట్ చేశారట. తద్వారా సినిమా పట్ల తనకున్న డెడికెషన్‌ ను చాటుకున్నారట. దీంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరి, హీరో సూర్య సినిమా ప్రమోషన్లలో బయట పెట్టారు.

దర్శకుడు వెంకీ అట్లూరి ఇటీవల ఓ ప్రమోషనల్ వీడియోలో రాధిక గురించి మాట్లాడారు. ‘మేము సెట్‌లో ఫుల్ కామెడీ సీన్ షూట్ చేస్తున్నాం. సరిగ్గా అదే టైమ్‌లో రాధికా మేడమ్ మదర్ గీతా రాధ గారు చనిపోయారనే బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఆ వార్త వినగానే నేను పూర్తిగా బ్లాంక్ అయిపోయాను. కానీ ఆమె మాత్రం మిగిలిన షాట్స్ పూర్తి చేసేసి వెళ్తాను అని చెప్పారు’ అంటూ వెంకీ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

రాధిక గురించి సూర్య మాటల్లో..

ఇక స్టార్ హీరో సూర్య సైతం రాధికా డెడికేషన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ కళకు రాధిక గారు ఇస్తున్న గౌరవం ఎలాంటిదో ఈ ఒక్క సంఘటన చెప్తుంది. ఇన్నేళ్ల పాటు లెజెండరీ కెరీర్‌ని కొనసాగించారంటే దానికి కారణం సినిమాపై ఆమెకున్న ప్రేమే. సినిమా రంగానికి, తన వృత్తికి ఆమె ఇచ్చే రెస్పెక్ట్ అనితరసాధ్యం’ అని సూర్య కొనియాడారు.

ఇక ఇదే విషయంపై రాధిక మాట్లాడుతూ.. ‘ ఆ సీన్ 85 శాతం పూర్తయింది. కేవలం ఐదు షాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ సీన్‌ని మళ్లీ రీక్రియేట్ చేయడం చాలా కష్టం. నా తల్లి ఆస్పత్రిలో క్రిటికల్ కండిషన్‌లో ఉన్నప్పుడే నేను షూటింగ్‌కి వచ్చాను. నువ్వు వెళ్లి షూటింగ్ పూర్తి చేయి అని ఆమే నాతో చెప్పారు’ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తల్లి చనిపోయారని తెలిసినా షూటింగ్‌ కొనసాగించిన టాలీవుడ్ హీరోయిన్
తల్లి చనిపోయారని తెలిసినా షూటింగ్‌ కొనసాగించిన టాలీవుడ్ హీరోయిన్
గుమ్మడికాయ లడ్డు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోలేరు
గుమ్మడికాయ లడ్డు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోలేరు
ఒకే ఒక్క టికెట్‌తో మారిన జాతకం..రాత్రికి రాత్రే రూ.8,700 కోట్ల
ఒకే ఒక్క టికెట్‌తో మారిన జాతకం..రాత్రికి రాత్రే రూ.8,700 కోట్ల
24 గంటల్లోనే భారత్, అఫ్గానిస్థాన్ సిరీస్ షెడ్యూల్ మార్పు?
24 గంటల్లోనే భారత్, అఫ్గానిస్థాన్ సిరీస్ షెడ్యూల్ మార్పు?
బలాన్నిచ్చే ప్రోటీన్ పౌడర్.. ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
బలాన్నిచ్చే ప్రోటీన్ పౌడర్.. ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
జబర్దస్త్‌లోకి ఆ కమెడియన్ రీ ఎంట్రీ..
జబర్దస్త్‌లోకి ఆ కమెడియన్ రీ ఎంట్రీ..
రాహుల్‌ గాంధీపై ప్రహ్లాద్ జోషి ఆగ్రహం.. ఏమన్నారంటే..
రాహుల్‌ గాంధీపై ప్రహ్లాద్ జోషి ఆగ్రహం.. ఏమన్నారంటే..
నాగ పంచమి రోజున చేయాల్సినవి.. చేయకూడనివి ఇవే! నాగదేవత పూజా విధానం
నాగ పంచమి రోజున చేయాల్సినవి.. చేయకూడనివి ఇవే! నాగదేవత పూజా విధానం
ఆ హీరోకు మా ఫ్యామిలీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు..
ఆ హీరోకు మా ఫ్యామిలీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు..
తిరుమలలో తళుక్కుమన్న ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. గుర్తు పట్టారా?
తిరుమలలో తళుక్కుమన్న ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. గుర్తు పట్టారా?