Varisu Movie: విజయ్ బర్త్ డే కానుకగా మరో స్పెషల్ అప్డేట్.. వారసుడు సెకండ్ లుక్ చూశారా ?
విజయ్ పుట్టినరోజు కావడంతో మరో స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వారసుడు సినిమా నుంచి దళపతి సెకండ్ లుక్ రిలీజ్ చేశారు... ఈ పోస్టర్ కూడా మరింత ఇంప్రెసివ్ గా ఉందనే చెప్పాలి..
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో తెలుగులో సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘వారసుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి.. విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ జూన్ 21న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు విజయ్. అందులో స్టయిలీష్ గా కనిపిస్తూనే సీరియస్ లుక్ ఇవ్వడం ఆసక్తిని పెంచింది.” ది బాస్ రిటర్న్స్” అనే ట్యాగ్ లైన్ మరింత ఇంట్రస్టింగ్ గా వుంది. భారీ అంచనాలు వున్న ఈ కాంబినేషన్ పై టైటిల్, పోస్టర్ ఆ అంచనాలని మరింత భారీగా పెంచాయి.
ఇదిలా ఉంటే.. జూన్ 22న విజయ్ పుట్టినరోజు కావడంతో మరో స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వారసుడు సినిమా నుంచి దళపతి సెకండ్ లుక్ రిలీజ్ చేశారు… ఈ పోస్టర్ కూడా మరింత ఇంప్రెసివ్ గా ఉందనే చెప్పాలి.. అందులో విజయ్ ప్రశాంతంగా కనిపిస్తూ.. పిల్లలు మధ్యలో నవ్వుతూ పడుకుని.. గాలిపటాలు చెరుకులు వంటివి కనిపిస్తూ ఎక్కడికో వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నారు.. ఈ సినిమాలో విజయ్ మరింత స్టైలీష్ లుక్ లో కనిపించనున్నట్లుగా పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షలని ఆకట్టుకునే చిత్రాలను రూపొందించే ప్రతిభగల దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం యూనివర్సల్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి తమిళంలో ‘వారిసు’ టైటిల్ ని ఖరారు చేశారు. ఈ చిత్రం కోసం బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్‌ను తయారు చేసిన దర్శకుడు వంశీపైడిపల్లి విజయ్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయనున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో సినిమా కోర్ టీమ్ పై కీలకమైన భారీ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Sankranthi 2023 is going to be special with the arrival of #Vaarasudu #VaarasuduSecondLook#Vaarasudu#Varisu#HBDDearThalapathyVijay
Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Cinemainmygenes @KarthikPalanidp pic.twitter.com/GySYHlT488
— Sri Venkateswara Creations (@SVC_official) June 22, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.