తమన్నా వద్దు జాన్వీనే కావాలి..! అభిమాని చేసిన పనికి మిల్కీబ్యూటీ షాక్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది.

తమన్నా వద్దు జాన్వీనే కావాలి..! అభిమాని చేసిన పనికి మిల్కీబ్యూటీ షాక్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే
Tamannaah, Janhvi Kapoor

Updated on: Aug 18, 2025 | 6:53 PM

మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. తెలుగులో చివరిగా ఓదెల 2 అనే సినిమా చేసింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా తమన్నాకు ఊహించని ఘటన ఎదురైంది.   ఓ అభిమాని చేసిన పనికి షాక్ అయ్యింది తమన్నా.. ఇంతకూ ఏం జరిగిందంటే..

Bigg Boss 9: అబ్బో.. పెద్ద ప్లానే..! బిగ్ బాస్ హౌస్‌లోకి ట్రెండింగ్ జంట.. ఇక రచ్చ రచ్చే

తాజాగా తమన్నా ముంబై విమానాశ్రయంలో కనిపించింది. తమన్నాతో పాటు అక్కడే జాన్వికపూర్ కూడా కనిపించింది. ఇద్దరు భామలు ముంబై విమానాశ్రయంలో కనిపించే సరికి అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అయితే ఓ అభిమాని తమన్నాను వెనక్కి నెట్టి మరీ జాన్వీ కపూర్ తో ఫోటో దిగడానికి ప్రయత్నించాడు. అభిమాని తమన్నాను వెన్నక్కి వెళ్ళమని జాన్వీతో ఫొటోలో దిగేందుకు ప్రయతించాడు. ఇంతకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

అప్పుడు నెలకు రూ.500.. ఇప్పుడు రూ. 83కోట్లకు మహారాణి.. 44 ఏళ్ల వయసులోనూ అదే హాట్‌నెస్

తమన్నా, జాన్వికపూర్ ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే ఫైట్ దిగారని తెలుస్తుంది. ఫైట్ దిగి విమానాశ్రయంలో నడుచుకుంటూ వస్తుండగా అభిమానులు ఫోటోల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలోనే జాన్వీ అభిమానులు తమన్నాను పక్కన పెట్టేసి మరి జాన్వీతో ఫోటోలు దిగారు. తమన్నా కూడా ఎంతో సహనంగా.. వాళ్లు ఫోటోలు దిగే వరకు అలా చూస్తూ ఉండిపోయింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. తమన్నా ఫ్యాన్స్ స్పందిస్తూ.. జాన్వీ ఫ్యాన్స్ కాస్త ఓవర్ చేశారు అని అంటున్నారు. ప్రస్తతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చేసిన ఒకేఒక్క సినిమా రిలీజ్ కూడా కాలేదు.. కానీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా క్రేజీ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.