Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah: అందాల తార మిల్కీబ్యూటీ పుట్టినరోజు.. తమన్నా గురించి ఈ విషయాలు తెలుసా ?..

ఇటీవలే భోళా శంకర్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. పాన్ ఇండియా మూవీ లవర్స్, అభిమానులు తమన్నాను ముద్దుగా మిల్కీబ్యూటీ అని పిలుచుకుంటారు. ఈరోజు (డిసెంబర్ 21న) తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందామా. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ జాబితాలో తమన్నా ఐదవ స్థానంలో నిలిచింది.

Tamannaah: అందాల తార మిల్కీబ్యూటీ పుట్టినరోజు.. తమన్నా గురించి ఈ విషయాలు తెలుసా ?..
Tamannaah Bhatia
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 21, 2023 | 10:29 AM

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు ఏర్పర్చుకుంది. ఇటీవలే భోళా శంకర్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. పాన్ ఇండియా మూవీ లవర్స్, అభిమానులు తమన్నాను ముద్దుగా మిల్కీబ్యూటీ అని పిలుచుకుంటారు. ఈరోజు (డిసెంబర్ 21న) తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందామా. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ జాబితాలో తమన్నా ఐదవ స్థానంలో నిలిచింది. 2005లో శ్రీ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అదే ఏడాది చాంద్ సా రోషన్ చెహ్రా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

2023లో ఆమె ఆస్తుల విలువ $16 మిలియన్స్. అంటే దాదాపు రూ.132 కోట్లు. విభిన్న కథాంశాలను.. ఎన్నో కఠినమైన పాత్రలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది తమన్నా. దాదాపు 18 సంవత్సరాలుగా వెండితెరపై కథానాయికగా కొనసాగుతుంది ఈ బ్యూటీ. 33 ఏళ్ల ఈ బ్యూటీ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్. తమన్నా సంవత్సరానికి సుమారుగా రూ.12 కోట్లు సంపాదిస్తుంది. సినిమాలతోపాటు.. బిజినెస్.. ప్రకటనల్లో నటిస్తూ భారీగా సంపాదిస్తుంది. ఒక్కో ప్రాజెక్ట్ కోసం తమన్నా దాదాపు రూ.4 నుంచి 5 కోట్లు తీసుకుంటుందట. ఒక్క స్పెషల్ సాంగ్ కోసం రూ.60 లక్షలు తీసుకుంటుందట.

2018లో ఐపిఎల్ ప్రారంభ వేడుకలో 10 నిమిషాల పాట కోసం రూ.50 లక్షలు తీసుకుందట. ఫాంటా, మొబైల్ ప్రీమియర్ లీగ్, సెల్కాన్ మొబైల్స్, చంద్రిక వంటి బ్రాండ్స్ కు అంబాసిడర్. ముంబైలోని రూ. 16.6 కోట్ల విలువైన 80700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న జుహు అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంది. అలాగే ఆమె వద్ద.. ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, BMW 320i, Mercedes-Benz GLE, Mitsubishi Pajero Sport వంటి మోడల్ కార్స్ ఉన్నాయి. కార్ కలెక్షన్ మొత్తం రూ.2.3 కోట్లకు పైగానే ఉంది. ఆమె వార్డ్‌రోబ్‌లో సుమారు రూ. 3 లక్షల విలువైన హై-ఎండ్ చానెల్ హ్యాండ్‌బ్యాగ్ ఉంది. తమన్నా 2015లో వైట్ & గోల్డ్ అనే స్టోర్‌ను ప్రారంభించి నగల వ్యాపారంలోకి అడుగుపెట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.