Tamannaah: పెళ్లి చేసుకుంటారంటే ఇలా షాక్ ఇచ్చారేంటి? హైదరాబాదీ నటుడితో తమన్నా బ్రేకప్! కారణమిదే!
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, నటుడు విజయ్ వర్మ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా పార్టీలు, ఫంక్షన్లు, వెకేషన్లలో జంటగానే కనిపించారు. అయితే ఈ ప్రేమ బంధం ఇప్పుడు బీటలు వారిందని సమాచారం

సీనియర్ నటి తమన్నా భాటియా, బాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ వర్మ వివాహం చేసుకుంటారని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న విజయ్ వర్మ, తమన్నా భాటియా ఇప్పుడు విడిపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. సినిమా ప్రపంచంలో ప్రేమించుకోవడం విడిపోవడం సహజం. ఈ క్రమంలోనే తమన్నా, విజయ్ వర్మ కూడా బ్రేకప్ చెప్పుకున్నారని తెఉలస్తోది. అయితే వీరు విడిపోవడానికి కారణాలేంటో ప్రస్తుతానికి తెలియరాలేదు. ప్రస్తుతం తమన్నా, విజయ్ వర్మలకు చిత్ర పరిశ్రమలో డిమాండ్ ఉంది. ఇద్దరూ క్రేజీ ప్రాజెక్టులతో బిజి బిజీగా ఉంటున్నారు. అయితే తాము ప్రేమికులుగా విడిపోయినా మంచి స్నేహితులుగా కొనసాగుతామని తమన్నా, విజయ్ చెబుతున్నారట. తమ వృత్తి జీవితంలో ఒకరినొకరు గౌరవించుకుంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
తమన్నా భాటియా, విజయ్ వర్మ విడిపోయి ఇప్పటికే చాలా వారాలు గడిచిపోయాయని వారి సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త విని అభిమానులు షాక్ అవుతున్నారు. త్వరలోనే పెళ్లిపీటలెక్కుతారని భావించిన జంట ఇలా బ్రేకప్ చెప్పుకుంటుందని అసలు ఊహించలేదంటున్నారు అభిమానులు. అయితే దీనిపై తమన్నా నుంచి కానీ, విజయ్ నుంచి కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.రాబోయే రోజుల్లో వారు విడిపోవడం గురించి బహిరంగంగా మాట్లాడతారని భావిస్తున్నారు. తమన్నా భాటియా, విజయ్ వర్మ కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’ సినిమాలో నటించారు. అప్పటి నుంచి వారి ప్రేమ కథ మొదలైందని తెలుస్తోంది. ఈ ఏడాది ఈ ప్రేమ పక్షులు పెళ్లి చేసుకోనున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇంతలోనే షాకిచ్చారు తమన్నా, విజయ్ వర్మ. అనూహ్యంగా విడిపోయారీ అభిమానులకు షాక్ ఇచ్చారు.
తమన్నాతో విజయ్ వర్మ..
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓదెల 2 సినిమాలో నటిస్తోంది తమన్నా. గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘ఓదెల రైల్వే స్టేషన్’కు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా ఈవెంట్ లో తమన్నా, విజయ్ వర్మ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








