AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు చూడటం మానేశా.. ఆ బాధ ఇప్పటికీ నాలో ఉంది

ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తన సినీ ప్రస్థానం, ముఖ్యంగా యమలీల వంటి విజయవంతమైన చిత్రాల వెనుక ఉన్న సవాళ్లను వివరించారు. యమలీలలో అలీని హీరోగా తీసుకోవాలనే తన నిర్ణయాన్ని పలువురు పెద్ద హీరోలు వ్యతిరేకించారని, తాము చేస్తామని చెప్పారని ఆయన గుర్తుచేసుకున్నారు.

అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు చూడటం మానేశా.. ఆ బాధ ఇప్పటికీ నాలో ఉంది
Sv Krishnareddy
Rajeev Rayala
|

Updated on: Sep 25, 2026 | 10:49 AM

Share

తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అగ్ర కథానాయికల్లో సౌందర్య ఒకరు. తన సహజమైన నటన, అద్భుతమైన హావభావాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె.. అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఇప్పటికీ సినీ అభిమానులను కలచివేస్తూనే ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న దర్శకుడు, నటుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆమెను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. సినీ ప్రయాణంలో సౌందర్యతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి.. ఆమె వ్యక్తిత్వం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒక సందర్భంలో అలీ పక్కన నటించడానికి సౌందర్య అంగీకరించలేదని ఆయన తెలిపారు. అయితే ఆ విషయాన్ని అక్కడితో వదిలేయకుండా.. సౌందర్య స్వయంగా తనకు ఫోన్ చేసి వివరణ ఇచ్చారని కృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు. తాను చెప్పిన మాటకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఆమెకు లేకపోయినా, ఎంతో పెద్ద మనసుతో ఫోన్ చేసి మాట్లాడటం తనకు ఇప్పటికీ గుర్తుందని చెప్పారు.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

సౌందర్య నటనపై కృష్ణారెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆమెను కేవలం హీరోయిన్‌గా కాకుండా గొప్ప నటిగా గుర్తుచేసుకున్నారు. సహజమైన నటనతో పాత్రకు ప్రాణం పోయగలిగిన ప్రతిభ ఆమె సొంతమని పేర్కొన్నారు. అయితే సౌందర్య అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని కృష్ణారెడ్డి తెలిపారు. ఆమె మరణించిన విషయం తెలిసిన సమయంలో తాను అస్సలు జీర్ణించుకోలేకపోయానని చెప్పారు. సౌందర్యతో పాటు ఆమె అన్నయ్య కూడా అదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమైన ఘటనగా ఆయన పేర్కొన్నారు. ఇద్దరూ అగ్నికి ఆహుతై ప్రాణాలు కోల్పోయిన విషయం తలుచుకుంటే ఇప్పటికీ మనసు కలచివేస్తుందని భావోద్వేగానికి గురయ్యారు.

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

ఆ విషాద సంఘటన తర్వాత సౌందర్య సినిమాలను చూడటం కూడా తన వల్ల కావడం లేదని కృష్ణారెడ్డి వెల్లడించారు. తెరపై సౌందర్య కనిపించిన ప్రతిసారీ ఆమె లేని లోటు గుర్తుకు వస్తుందని, అందుకే ఆమె సినిమాలను చూడలేకపోతున్నానని చెప్పారు. ఇంతటి గొప్ప నటి ఇలా అర్ధాంతరంగా దూరం కావడం నిజంగా దురదృష్టకరమని ఎస్వీ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సినీ రంగంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న సౌందర్య.. ఇలా మంటల్లో మసైపోవడం తనను ఇప్పటికీ బాధిస్తూనే ఉందన్నారు. జీవితంలో కొన్ని సంఘటనలను ఎంత ప్రయత్నించినా మార్చలేమని, సౌందర్య విషయంలో జరిగిన విషాదం కూడా అలాంటిదేనని పేర్కొన్నారు కృష్ణ రెడ్డి.

ఇవి కూడా చదవండి

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

Soundarya

Soundarya

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దట్టమైన పొగమంచుతో అరకు లోయ అందాలు అదుర్స్!
దట్టమైన పొగమంచుతో అరకు లోయ అందాలు అదుర్స్!
భారీ వర్షాల్లోనూ తగ్గని లడ్డూ క్రేజీ..! జూమ్‌లో వేలం!
భారీ వర్షాల్లోనూ తగ్గని లడ్డూ క్రేజీ..! జూమ్‌లో వేలం!
అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు చూడటం మానేశా..
అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు చూడటం మానేశా..
టేకు ఆకులలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే ఔరా అనాల్సిందే!
టేకు ఆకులలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే ఔరా అనాల్సిందే!
ఐటీ కారిడార్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం..!
ఐటీ కారిడార్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం..!
వైభవ్ సూర్యవంశీకి సవాల్ విసిరిన న్యూజిలాండ్ కోచ్
వైభవ్ సూర్యవంశీకి సవాల్ విసిరిన న్యూజిలాండ్ కోచ్
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారికి బిగ్‌ అలర్ట్‌.. కొత్త రూల్స్‌..!
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారికి బిగ్‌ అలర్ట్‌.. కొత్త రూల్స్‌..!
ఈ రాశులకు విపరీత రాజయోగం, లక్ష్మీ కటాక్షంతో పట్టిందల్లా బంగారమే!
ఈ రాశులకు విపరీత రాజయోగం, లక్ష్మీ కటాక్షంతో పట్టిందల్లా బంగారమే!
ఖైరతాబాద్‌ బాహుబలి గణపతికి..రథసారథి ఎవరో తెలుసా? అతడి జీతం ఎంతంటే
ఖైరతాబాద్‌ బాహుబలి గణపతికి..రథసారథి ఎవరో తెలుసా? అతడి జీతం ఎంతంటే
పాలు విరగవు, చల్లారినా చిక్కబడడు.. ఈసారి సేమియా పాయసం ఇలా చేయండి
పాలు విరగవు, చల్లారినా చిక్కబడడు.. ఈసారి సేమియా పాయసం ఇలా చేయండి