AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: సుధీర్, వర్షిణీ సేఫ్.. దీపావళి వేళ ఎలిమినేషన్‌పై ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొమ్మిదో వారం ఎలిమినేషన్ లో భాగంగా సుధీర్ లేదా యాంకర్ వర్షిణీ ఎవరో ఒకరు హౌస్ నుంచి బయటకు పోవచ్చని ప్రచారం జరిగింది. డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరూ బ్యాగ్ సర్దేసుకోవాల్సిందేనని వార్తలు వచ్చాయి. అయితే ఇంతలోనే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్

Bigg Boss Telugu 10: సుధీర్, వర్షిణీ సేఫ్.. దీపావళి వేళ ఎలిమినేషన్‌పై ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Nov 08, 2026 | 1:03 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొమ్మిదో వారం చివరి దశకు చేరుకుంది. గత రెండు వారాల్లాగే ఈసారి కూడా హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావించారు. ఈ వారం ఎలిమినేషన్ కు సంబంధించి మొత్తం 10 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు. యాంకర్ వర్షిణి, ముఖేష్ గౌడ, అమన్ మసూద్, టెంపర్ వంశీ, నీతు మాస్టర్, శివ, నరేష్, దేబ్జానీ, సుధీర్, రాంప్రసాద్ ఈ వారం ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంంటున్నారు.వీరి ఓటింగ్ విషయానికి వస్తే.. రోహిత్ లేకపోవడం, త్రిగుణ్ కూడా నామినేషన్స్ నుంచి తప్పుకోవడంతో ముఖేష్ గౌడ కి భారీగా ఓట్లు పడ్డాయి.ప్రస్తుతం ఆయన టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. ఇక త్రిగుణ్ సపోర్ట్ తో పాటు కెప్టెన్సీ కూడా కలిసి రావడంతో టెంపర్ వంశీ రెండవ స్థానంలో దూసుకుపోతున్నారడు. ఆ తర్వాత రాంప్రసాద్, అమన్, నరేష్, దెబ్జానీలు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. యాంకర్ వర్షిణీ, శివకుమార్, సుధీర్ కు చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. ఓటింగ్ పరంగా యాంకర్ వర్షిణీ, సుధీర్ చివరి స్థానాల్లో నిలిచారు. గతవారం ముఖేష్ పవర్ ద్వారా త్రుటిలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న సుధీర్ లేదా యాంకర్ వర్షిణీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి సమయంలో కంటెస్టెంట్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్.

కాగా గతంలో సరిగ్గా దసరా పండగ రోజున ఎలిమినేట్ అయ్యింది శాలినీ పటేల్. అయితే పండగ పూట ఇంటికి ఏడూస్తూ వెళ్లడం సరికాదని ఆమెకు సీక్రెట్ రూమ్ కు పంపించి సేవ్ చేశాడు బిగ్ బాస్. ఇప్పుడు తొమ్మిదో వారంలోనూ సరిగ్గా ఇలాగే జరగనుందని సమాచారం. ఆదివారం (నవంబర్ 11) దీపావళి కావడంతో ఈ తొమ్మిదవ వారంలో ఎలాంటి ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. పండుగను పురస్కరించుకొని దీపావళి ధమాకా ట్రీట్ గా బిగ్ బాస్ మేకర్స్ ఈ వారం ఎలిమినేషన్ ను రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే డేంజర్ జోన్ లో ఉన్న సుధీర్, యాంకర్ వర్షిణీలకు ఇది పెద్ద ఊరట అని చెప్పవచ్చు. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ దాకా వేచి చూడాల్సిందే.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?
కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?
సుధీర్, వర్షిణీ సేఫ్.. బిగ్ బాస్10 ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్
సుధీర్, వర్షిణీ సేఫ్.. బిగ్ బాస్10 ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్
ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!
ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!
దీపావళీ బరిలో సూర్య సెన్సేషన్.. సీన్ సినిమాతో రికార్డులు..
దీపావళీ బరిలో సూర్య సెన్సేషన్.. సీన్ సినిమాతో రికార్డులు..
చేతులెత్తేసిన సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులు.. పోరాడుతోన్న అర్జున్
చేతులెత్తేసిన సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులు.. పోరాడుతోన్న అర్జున్
చిన్న అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ నుంచి రూ. 277 కోట్ల వ్యాపారం వరకు!
చిన్న అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ నుంచి రూ. 277 కోట్ల వ్యాపారం వరకు!
నెల పాటు నిల్వ ఉండే కమ్మని టమాటా పచ్చడి.. కడుపునిండా తినేస్తారు!
నెల పాటు నిల్వ ఉండే కమ్మని టమాటా పచ్చడి.. కడుపునిండా తినేస్తారు!
తెలంగాణ గ్రామాలకు గుడ్‌న్యూస్.. ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్!
తెలంగాణ గ్రామాలకు గుడ్‌న్యూస్.. ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్!
ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు
ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు
రెండు వన్డేల్లో గెలిచినా.. ఈ ముగ్గురితో గంభీర్‌కు టెన్షనే..!
రెండు వన్డేల్లో గెలిచినా.. ఈ ముగ్గురితో గంభీర్‌కు టెన్షనే..!