మరోసారి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య..!
తమిళ స్టార్ హీరో సూర్య ఎప్పుడూ కొత్తదనం ఉన్న కథలే తన సినిమాలకు ఎన్నుకుంటారు. లవర్ బాయ్, అల్లరి చిల్లరిగా తిరిగే పోకిరి, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఇలా ఏ పాత్ర వేసినా సూర్యకు భలే నప్పుతుంది.

తమిళ స్టార్ హీరో సూర్య ఎప్పుడూ కొత్తదనం ఉన్న కథలే తన సినిమాలకు ఎన్నుకుంటారు. లవర్ బాయ్, అల్లరి చిల్లరిగా తిరిగే పోకిరి, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఇలా ఏ పాత్ర వేసినా సూర్యకు భలే నప్పుతుంది. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ చేస్తున్నాడు సూర్య. ఇప్పటికే ఈ సినిమా వెండితెరపై అలరించాల్సిన చిత్రం కోవిడ్-19 కారణంగా వాయిదా పడింది.
ఈ మూవీ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధమయ్యాడు సూర్య . మాస్ చిత్రాల దర్శకుడు హరితో పాటు ‘అసురన్’ దర్శకుడు వెట్రిమారన్‌తోనూ మూవీస్ కు పచ్చజెండా ఊపాడు. ‘మనం’ చిత్ర దర్శకుడు విక్రమ్ కె.కుమార్‌తో కలిసి వర్క్ చేయడానికి సిద్దమవుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇప్పటికే కథను కూడా విన్నడాట. అన్ని సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తమిళ సినీ వర్గాలు సమాచారం. 2016లో విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన ’24’ మూవీలో సూర్య హీరోగా నటించాడు. ఇందులో సూర్య తండ్రీ కొడుకు, విలన్ ఇలా మూడు పాత్రల్లో నటించి అదగొట్టాడు. అయితే ఈ మూవీలో తమిళ్ లో అంతగా ప్రజాదారణ పొందనప్పటికీ..తెలుగులో మాత్రం ఘనవిజయం అందుకుంది.




