AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annaatthe Teaser: తలైవా ఫ్యాన్స్ కు పండగే.. రజనీకాంత్ ‘అన్నాత్తే’ మాస్ మసాలా టీజర్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'అన్నాత్తే'.  యాక్షన్ దర్శకుడు శి దర్శకత్వలో ఈ సినిమా తెరకెక్కింది.

Annaatthe Teaser: తలైవా ఫ్యాన్స్ కు పండగే.. రజనీకాంత్ 'అన్నాత్తే' మాస్ మసాలా టీజర్
Rajinikanth Annaatthe
Rajeev Rayala
| Edited By: Phani CH|

Updated on: Oct 15, 2021 | 8:45 AM

Share

Annaatthe Teaser: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’.  యాక్షన్ దర్శకుడు శి దర్శకత్వలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీకోసం తలైవా అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా సూపర్ స్టార్ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేశారు. ఆ పనుల మీద రజనీ బిజీ అవ్వడంతో ఈ సినిమాను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత రజనీకాంత్ అనారోగ్యానికి గురికావడంతో రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచన విరమించుకున్నారు. తిరిగి సినిమాను మొదలు పెట్టారు. అలా మొదలు పెట్టారో లేదో కరోనా కల్లోలం మొదలైంది. నిబంధనలు పాటిస్తూ షూటింగ్ కానిచ్చేదం అనుకున్నా.. సెట్లో‌ కొందరికి కరోనా వచ్చింది. దాంతో సినిమాకు మరోసారి బ్రేక్ పడింది. ఇలా అన్నీ అవాంతరాలను దాటి సినిమా ఎట్టకేలకు పూర్తయ్యింది.

తాజాగా విజయదశమి కానుకగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. తలైవా ఫ్యాన్స్ కు కావాల్సినంత మాస్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయని టీజర్ చూస్తే అర్ధామవుతుంది. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ‘అన్నాత్తే’ చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార, ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సూరి, అభిమన్యు సింగ్ ఇతరపత్రాల్లో కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jabardasth Sai Teja: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ..

Manchu Manoj-Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ కీలక భేటీ.. గంటకు పైగా చర్చ

Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేశ్ ఫుల్ క్లారిటీ.. ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్