Sarkaru Vaari Paata: యాక్షన్ మూడ్ లో సూపర్ స్టార్ మహేష్.. సర్కారు వారి పాట లేటెస్ట్ అప్డేట్..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్ర్క్కరు వారి పాట. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్ర్క్కరు వారి పాట. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కీర్తిసురేష్ ఈ సినిమాతో మొదటిసారి నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో మహేష్ సూపర్ స్టైలిష్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ ఈ మూవీ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్లో కనిపించనున్నారు. ఇప్పటికే కళావతి సాంగ్ ను విడుదల చేశారుచిత్రయూనిట్ ఈ పాట చాట్ బస్టర్ గా నిలిచింది. తమన్ సంగీతం అదించిన ఈపాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇటీవల మహేష్ బాబు మోకాలి సర్జరీ జరగడం.. ఆ తర్వాత.. మహేష్.. కీర్తి సురేష్ కరోనా బారిన పడడంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక అటు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా పడుతూ వస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు పై కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్టింగు లో జరుగుతుందని తెలుస్తుంది. ఈ యాక్షన్ సన్నివేశం తర్వాత మరో సారి కీర్తి సురేష్ తో మహేష్ బాబు జాయిన్ అవుతాడట. వీరిద్దరి కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ అలాగే ఒక పాట షూటింగ్ తో సినిమా పూర్తి అవుతుందని తెలుస్తుంది. మహేష్ బాబు తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వం లో చేయాల్సి ఉంది. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక సర్కారు వారి పాట సినిమా సమ్మర్ కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేయబోతున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చదవండి :




