AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.5090 కోట్లు సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే

హాలీవుడ్ సినిమాలకు మనదేశంలోనూ భారీగా అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఈ ఇంగ్లిష్ సినిమాలను ఎగబడి చూస్తారు. అలా యాక్షన్ జానర్ కు సంబంధించి హాలీవుడ్‌ ఫ్రాంఛైజీల్లో సూపర్ హిట్ అయిన సిరీస్స్ లో ఈ మూవీ ఒకటి. ఇప్పటివరకు ఈ సిరీస్ లో పలు సినిమాలు వచ్చాయి. అన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.5090 కోట్లు సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Aug 13, 2025 | 12:36 PM

Share

ఓటీటీ పుణ్యమా అని ఇప్పుడు కొత్త సినిమాలు కూడా ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. అలా థియేటర్స్ లో విడుదలైన సినిమాలు కొన్ని నెలలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు.. హిందీ, తమిళ్, కన్నడ, తమిళ్ సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. వీటితో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా మన దగ్గర సత్తా చాటుతున్నాయి. టాలీవుడ్ లో హాలీవుడ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సూపర్ హీరోల సినిమాలు గతంలో ఎన్నో హాలీవుడ్ సినిమాలు తెలుగలో డబ్ అయ్యి భారీ కలెక్షన్లు రాబట్టాయి.

ఇదికూడా చదవండి : ఏం పార్థు నన్నే మర్చిపోయావా..? నేను నీ పద్దుని.. ఎంత మారిపోయింది ఈ చిన్నది..

ఇక తెలుగులో మార్కెట్ ను పెంచుకునేందుకు, ఇక్కడి ఆడియెన్స్ కు మరింత చేరువ అయ్యేందుకు సినిమాలను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పుడు థియేటర్స్ లో దుమ్మురేపుతున్న సినిమా ఎదో కాదు సూపర్ మాన్. హాలీవుడ్ లో తెరకెక్కిన సూపర్ మాన్ సినిమాకు ఫ్యాన్ బేస్ వేరే లెవల్ లో ఉంటుంది. ఈ క్రమంలో సూపర్ మాన్ సినిమాలన్నీ మన దగ్గర భారీ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా వచ్చిన సూపర్ మాన్ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. జులై 11న విదులైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి :143 Movie : ఎన్నాళ్లకు కనిపించింది..!! 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..

రూ.5090 కోట్లు కలెక్ట్ చేసింది సూపర్ మాన్ సినిమా.. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది. ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సూపర్ మాన్ సినిమా విడుదలై ఐదువారాలు అవుతుంది. దాంతో ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది. తాజాగా సూపర్ మాన్ దర్శకుడు జేమ్స్ గన్ సోషల్ మీడియా వేదికగా సూపర్ మాన్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. సూపర్ మ్యాన్ ఈ శుక్రవారం, 8/15 మీ ఇళ్లకు వస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆగస్టు 15 నుంచి సూపర్ మ్యాన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, ఫాండాంగో ఎట్ హోమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇదికూడా చదవండి : 53 సినిమాలు చేసింది.. హీరోయిన్‌గానే కాదు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపింది.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us