Tollywood: మహేష్ బాబు ‘నాని’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ‘హీరో’ అయ్యాడు తెలుసా..?
నాని సినిమాలో ఈ కుర్రోడ్ని గుర్తుపట్టారా..? అతను ఇప్పుడు హీరో అయ్యాడు. మంచి బ్యాగ్రౌండ్ కూడా ఉంది. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నాడు.. తనెవరో మీరు చెప్పగలరా..?
మన తెలుగునాట చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా చేసినవాళ్లు.. ఇప్పుడు నటీనటులుగా రాణిస్తున్నారు. తేజ సజ్జ, కావ్య కల్యాణ్ రామ్, ఆకాశ్ పూరి లాంటి వాళ్లు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఈ కోవకు చెందిన మరో నటుడు కూడా హీరోగా మంచి సినిమాలు చేస్తున్నాడు. మహేష్ బాబు సినిమాలో నటించిన ఈ చిన్నోడు ఇప్పుడు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. మహేష్ బాబు హీరోగా నటించిన నాని సినిమా చాలా డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో వచ్చింది. ఎస్ జే సూర్య తెరకెక్కించిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే మంచి.. ప్రయోగాత్మక చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ మూవీలో హీరో ఫ్రెండ్‌గా యాక్ట్ చేసిన అబ్బాయి కూడా బాగా గుర్తుండిపోయాడు.
ఎందుకంటే హీరో పాత్ర కుర్రాడు కనిపించిన ప్రతీ సన్నివేశంలో ఈ బుడతడు కూడా ఉంటాడు. ఆ బాల నటుడు ఎవరో కాదు.. మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా. అవును నాని సినిమాలో నటించింది అశోక్ గల్లానే. ఆ సినిమా తర్వాతే అతనికి సినిమాలపై మక్కువ పెరిగిందట. అతగాడు ఇప్పుడు హీరో అయ్యాడు. 2022లో హీరోగా ప్రేక్షకులను పలకరించాడు. ‘హీరో’ పేరుతోనే వచ్చిన ఈ చిత్రం.. కోవిడ్ వేవ్‌లో కొట్టుకుపోయింది. ఇక మొన్నీమధ్య ‘దేవకీ నందన వాసుదేవ’ పేరుతో గత నెలలో కూడా ఆడియెన్స్‌ను పలకరించారు ఈ యువ హీరో. ఈ సినిమాకు కూడా పెద్ద రెస్పాన్స్ రాలేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.