Viral Video: టీచరమ్మగా మారిన మహేష్ నమ్రతల ముద్దుల తనయ ప్రిన్సెస్ సితార.. వీడియో వైరల్..
Viral Video: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) మాజీ మిస్ ఇండియా నమ్రత(namrata) ల ముద్దుల తనయ సితార(Sitara).. కూడా సెలబ్రేటీనే. తన తండ్రి, అన్నతో చేసే చిలిపిపనులు..
Viral Video: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) మాజీ మిస్ ఇండియా నమ్రత(namrata) ల ముద్దుల తనయ సితార(Sitara).. కూడా సెలబ్రేటీనే. తన తండ్రి, అన్నతో చేసే చిలిపిపనులు.. చదువు, టాలెంట్ తో ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక హాలీవుడ్ మూవీ కి డబ్బింగ్ చెప్పి వావ్ అనిపించుకుంది. 9 ఏళ్ల చిన్న వయసులోనే చదువుతో పాటుసింగర్, డ్యాన్సర్.. మొత్తానికి మల్టీ టాలెంటెడ్ సూపర్ కిడ్ గా పేరు తెచ్చుకుంది. సితార తన ఫ్రెండ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తో కలిసి ఓ యూట్యుబ్ ఛానల్ ను నిర్వహిస్తోంది. ఈ ఆద్య-సితార యూట్యూబ్ ఛానల్ లో ట్రావెలింగ్ స్టోరీస్, ఛాలెంజస్, గేమ్స్ వంటి అనేక వీడియోలు షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది. తమ ఫ్యామిలీ తో కలిసి వెళ్ళిన విదేశాలకు సంబంధించిన మంచి మంచి ప్రదేశాలను కూడా తన ఛానల్ లో పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలారిస్తోంది.
ప్రిన్స్ మహేష్ తనయ ప్రిన్సెస్ సితార తాజాగా తనలో టాలెంట్ ను అభిమానులకు పరిచయం చేస్తూ.. ఓ వీడియో ని తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది. వాటర్ కలర్స్ తో విండో పెయింటింగ్ ఎలా వేయాలి అనేది ముద్దు ముద్దు మాటలతో క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో వివరించింది సితార. ఈ పెయింటి వేయడానికి కావాల్సిన వస్తువులను కూడా ప్ల్యూయంట్ ఇంగ్లీష్ లో తెలిపింది. సితార చెప్పిన విధానం పలువురుని ఆకట్టుకుంది. పిట్ట కొచెం కూత ఘనం అనేలా ఉండి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచేలా చేసింది సితార.
సితార కేవలం పెయింటింగ్ లోనే కాదు సింగింగ్, డ్యాన్సింగ్ వంటి వాటిల్లో కూడా తన ప్రతిభను సొంతం చేసుకుంది. సితారకు సంబంధించిన కొన్ని వీడియోలను నమ్రత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.