అనిల్ మాస్టర్ ప్లాన్.. ఎఫ్3 సునీల్ కోసం అలాంటి పాత్రను క్రియేట్ చేస్తున్నారా..?

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Rajeev Rayala

Updated on: Jul 14, 2021 | 6:05 AM

అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఇప్పటివరకు ఈ కుర్ర దర్శకుడు చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అనిల్ మాస్టర్ ప్లాన్.. ఎఫ్3 సునీల్ కోసం అలాంటి పాత్రను క్రియేట్ చేస్తున్నారా..?
F3

అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఇప్పటివరకు ఈ కుర్ర దర్శకుడు చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొన్నటివరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన అనిల్. ఇటీవల మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలతో మంచి కథను అందించి హిట్ అందుకున్నాడు అనిల్. ఇప్పుడు అనిల్ దృష్టాంతా ఎఫ్ 2 సీక్వెల్ పైనే పెట్టాడు. గతంలో వెంకటేష్ -వరుణ్ తేజ్ లతో కలిసి ఎఫ్ 2 అనే సినిమా చేసాడు అనిల్. ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా వెంకీ -వరుణ్ కామెడీ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు అనిల్. ఈ సినిమాలో వెంకీ వరుణ్ లతోపాటు మరో హీరో కూడా ఉండనున్నాడని మొదటినుంచి వస్తున్న టాకే. అయితే ఈ మూడో హీరో ఎవరో కాదు ఒకప్పుడు కమెడియన్ గా అలరించి ఈ మధ్య హీరోగా మారిన సునీల్.

దర్శకుడు జంధ్యాల తెరకెక్కించిన అహ నా పెళ్లంట సినిమాలోని ఓ పాత్రను ఇప్పుడు అనిల్ తన సినిమా కోసం వాడుకుంటున్నారట. అహ నా పెళ్లంట సినిమాలో కోటశ్రీనివాసరావు పోషించిన పిసినారి పాత్ర ను ఎఫ్ 3లో చూపించనున్నాడట అనిల్. ఆ పాత్రను దృష్టిలో పెట్టుకునే అనిల్ రావిపూడి ఒక పాత్రను తనదైన స్టైల్లో క్రియేట్ చేశాడట.ఈ పాత్ర కోసం ముందుగా రాజేంద్రప్రసాద్ ను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆపాత్రలో సునీల్ కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇక ఎఫ్ 3 సినిమా డబ్బు చుట్టూ తిరుగుతుందని ఇటీవల విడుదల చేసిన పోస్టర్లు చూస్తుంటే అర్ధమవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ram Lingusamy: రామ్‌ – లింగు స్వామి సినిమాలో విలన్‌గా నటిస్తోంది ఎవరో తెలుసా.. తమిళ హీరోను దించుతోన్న మేకర్స్‌.?

Balakrishna Akhanda: ఫైనల్‌ షెడ్యూల్‌ మొదలు పెట్టిన బాలయ్య.. నెట్టింట వైరల్‌ అవుతోన్న మేకింగ్‌ స్టిల్స్‌.

Renu Desai: అతను నా వెనకుంటే.. ఈ ప్రపంచంలో ఏదీ నన్ను బాధించదు. ఆసక్తికర పోస్ట్‌ చేసిన రేణు దేశాయ్‌.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu