Sundeep Kishan: తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే సమయం ఇది.. సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రస్థానం సినిమానుంచి ఇప్పటివరకు సందీప్ సెలక్ట్ చేసుకున్న స్టోరీ లన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. ఈ మధ్య చిన్న గ్యాప్ తీసుకున్న సందీప్ ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు.

Sundeep Kishan: తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే సమయం ఇది.. సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Sandeep Kishan
Follow us

|

Updated on: Oct 21, 2022 | 12:20 PM

యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మైఖేల్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్థానం సినిమానుంచి ఇప్పటివరకు సందీప్ సెలక్ట్ చేసుకున్న స్టోరీ లన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. ఈ మధ్య చిన్న గ్యాప్ తీసుకున్న సందీప్ ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఈసెంట్ గా ఈ సినిమా తెలుగు టీజర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేయగా, ధనుష్ తమిళ వెర్షన్‌ను, దుల్కర్ సల్మాన్ మలయాళ వెర్షన్‌ను, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి విడుదల చేశారు. హిందీ టీజర్‌ను రాజ్ కుమార్ రావ్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్, రాజ్- డీకే విడుదల చేశారు.  ఈసందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ..

“నాకు నేనుగా పెట్టుకున్న అతి పెద్ద టెస్ట్ ‘మైఖేల్’. మూడేళ్ళ క్రితం నుండి ‘మైఖేల్’ కోసం వర్క్ స్టార్ట్ చేశాం. దర్శకుడు రంజిత్ జయకోడి నాకు యునీవర్స్ ఇచ్చిన గిఫ్ట్. తను అద్భుతమైన ఫిల్మ్ మేకర్. అప్పుడప్పుడు నాకు కొంతమంది అసాదరణమైన ఫిల్మ్ మేకర్స్ తో పని చేసే అవకాశం దొరుకుతుంది. ఉదాహరణకు లోకేష్ కనకరాజ్. ఈ సినిమాని తమిళ్ ప్రజంట్ చేసేది తనే. ఆయన తర్వాత నేను బలంగా నమ్మింది రంజిత్ జయకోడి. అందరూ మొదటి సినిమాలా పని చేయాలనీ అంటారు. కానీ రంజిత్ మాత్రం ఇదే మన ఆఖరి చిత్రం అయితే ఎలా పని చేస్తామో అలా చేయాలి అంట గొప్ప జ్ఞాపకంగా మిగిలే సినిమాలా చేయాలనీ అంటారు. ఈ సినిమా కోసం 24 కిలోల బరువు తగ్గాను. షూటింగ్ లో హీరో కంటే ఎక్కువ రిస్కులు చేసే దర్శకుడు రంజిత్. రామ్ మోహన్ గారు, సునీల్ గారు, భరత్ గారు అనుకున్న బడ్జెట్ పెరుగుతున్నా ఎక్కడా రాజీ పడకుండా సినిమాని భారీగా నిర్మించారు.

టీజర్ చూసి ప్రేక్షకులు చాలా మంచి సినిమా తీసామనే ధైర్యాన్ని ఇచ్చారు. విజయ్ సేతుపతి అన్నతో పని చేయడం గ్రేట్ ఫీలింగ్. తొమ్మిది రోజులు రాత్రిపగలు ఆయనతో షూటింగ్ చేశాం. ఒక్క క్షణం కూడా అలసట చెందలేదు. పైగా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. గౌతం మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్ వరుణ్ సందేశ్, అనసూయ ఇలా చాల మంచి నటీనటులు ఇందులో భాగమయ్యారు. ధనుష్ అన్న, నాని, దుల్కర్, రక్షిత్ శెట్టి, రాజ్ కుమార్ రావ్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్, రాజ్ – డీకే టీజర్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్షకుల నెంబర్ వన్ ప్రేక్షకులు గా వున్నారని నెంబర్స్ చెబుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే సమయం ఇది. మైఖేల్ లో ఒక కొత్త ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.