కంటి ఆపరేషన్లు చేసే రోబో.. చైనా పరిశోధకుల అద్భుత సృష్టి
చైనా పరిశోధకులు కంటిలోని సున్నిత భాగాలపై సర్జరీ చేసే ఆటానమస్ రోబోను అభివృద్ధి చేశారు. రెటీనా సర్జరీలలో కచ్చితత్వం, భద్రతను ఇది గణనీయంగా పెంచుతుంది. మనుషులతో పోలిస్తే రోబో పొరపాట్లను 80% తగ్గించింది. మారుమూల ప్రాంతాల్లోనూ క్లిష్టమైన కంటి ఆపరేషన్లకు ఈ ఆవిష్కరణ మార్గం సుగమం చేస్తుంది.
చైనా పరిశోధకులు అద్భుత ముందడుగు వేశారు. కంటిలోని సున్నిత భాగాల్లో సర్జరీ చేసే రోబోను అభివృద్ధి చేశారు. కంటిలోని నిర్మాణాలు చాలా చిన్నవిగా, మృదువుగా ఉండటంతో రెటీనా సర్జరీలు అత్యంత సవాళ్లతో నిండి ఉంటాయి.చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆటోమేషన్ ఈ రోబోను రూపొందించింది. రెటీనా సంబంధిత వ్యాధులకు చికిత్స అందించే సర్జరీలలో కచ్చితత్వం, భద్రతను ఈ రోబో పెంచుతుందని భావిస్తున్నారు. జిన్హువా న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం జంతువులపై జరిపిన ప్రయోగాల్లో ఈ రోబో 100 శాతం విజయవంతంగా సబ్-రెటినల్, ఇంట్రావాస్కులర్ ఇంజెక్షన్లు ఇచ్చింది. ఆ వివరాలను పరిశోధకులు “సైన్స్ రోబోటిక్స్” జర్నల్‌లో ప్రచురించారు. ఈ కొత్త రోబోటిక్ వ్యవస్థ 3D స్పేషియల్ పర్సెప్షన్, ప్రిసైజ్ పొజిషనింగ్ వంటి అధునాతన అల్గారిథమ్‌లతో పనిచేస్తుంది. ప్రయోగాల్లో, మనుషులు చేసే సర్జరీలతో పోలిస్తే ఈ రోబో పొరపాట్లను దాదాపు 80 శాతం తగ్గించింది. డాక్టర్‌తో పోలిస్తే 55 శాతం తక్కువ తప్పులు చేసినట్లు బృందం తెలిపింది. ఈ ఆవిష్కరణతో నిపుణులైన సర్జన్లు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో కూడా క్లిష్టమైన కంటి ఆపరేషన్లు చేసే అవకాశం ఏర్పడుతుంది. గతేడాది నవంబర్‌లో చైనా 5G టెక్నాలజీతో రిమోట్ రోబోటిక్ కంటి సర్జరీ చేసింది, అయితే అది సర్జన్ నియంత్రణలో జరగ్గా, తాజా ఆవిష్కరణ రోబో స్వయంగా అంటే అటనామస్‌గా పనిచేయడం విశేషం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం.. 5 దాటితే అంతే సంగతులు..
Amaravati: రాజధాని అమరావతిలో.. అంగరంగ వైభవంగా తొలిసారి రిపబ్లిక్ వేడుకలు
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
పోలీస్ స్టేషన్‌కు చేరిన చిలక పంచాయితీ
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు

