యాంకర్ సుమ ఎమోషనల్
యాంకర్ సుమ..సుమక్క అంటే బెటరేమో. ఎందుకంటే ఆమె తెలుగు లోగిళ్లో చిన్నవాళ్లందరికీ ఎప్పుడో అక్కగా మారిపోయింది.
యాంకర్ సుమ..సుమక్క అంటే బెటరేమో. ఎందుకంటే ఆమె తెలుగు లోగిళ్లో చిన్నవాళ్లందరికీ ఎప్పుడో అక్కగా మారిపోయింది. రోజూ నాలుగు, ఐదు టీవీ కార్యక్రమాలలో కనిపిస్తూ మన కుటుంబ సభ్యురాలు అయిపోయింది. అద్బుతమైన వాక్చాతుర్యంతో పాటు అశ్లీలత వినిపించని పంచ్ లతో ఆకట్టకుంటుంది. ఎవరిని నొప్పించకుండా, ఆడంబరాలకు పోకుండా తెలుగు టీవీ సూపర్ స్టార్ గా కొనసాగుతోంది.
తాజాగా సుమ తన భర్త రాజీవ్ కనకాలతో కలిసున్న ఓ ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు ఆ చిత్రానికి ‘మై డియర్ రాజా.. ఎప్పటికీ నా సంతోషం నీవే’ అంటూ భర్తపై ప్రేమను వెలిబుచ్చింది. ఫొటోలో రాజీవ్ భుజాలపై వాలి, కనులు మూసుకుని భర్త చేయి పట్టుకుని బావోద్వేగంతో ఉంది సుమ. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
My dearest raja , my ❤️ , oneness and happiness forever #Rajeevkanakala pic.twitter.com/rxSqffqulm
— Suma Kanakala (@ItsSumaKanakala) September 14, 2020
సుమ, రాజీవ్ కనకాల విడాకుల వార్తలు ఈ మధ్య బాగా సర్కులేట్ మారాయి. ఈ ఇద్దరి మధ్య విభేదాల కారణంగా విడిపోతున్నారంటూ కొందరు ప్రచారం చేశారు. సుమ,రాజీవ్‌తో కలిసి ఉండటం లేదంటూ పుకార్లు షికార్లు చేశాయి.ఈ పుకార్లకు ఇటీవల క్యాష్ ప్రోగ్రామ్‌తో చెక్ పెట్టింది సుమ. భర్త రాజీవ్‌తో తన బంధం పదిలమో చెప్పకనే చెప్పింది.
Also Read :