సుశాంత్ ఫామ్ హౌస్ లో హుక్కా, యాష్ ట్రే, ఇంకా ఎన్నో, !

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు . .ఎప్పటికప్పుడు తాము కనుగొన్న వివరాలను మీడియాకు తెలియజేస్తున్నారు. అతనికి చెందిన పావనా లేక్ ఫామ్ హౌస్ లో...

సుశాంత్ ఫామ్ హౌస్ లో హుక్కా, యాష్ ట్రే, ఇంకా ఎన్నో, !
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Sep 14, 2020 | 6:29 PM

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు . .ఎప్పటికప్పుడు తాము కనుగొన్న వివరాలను మీడియాకు తెలియజేస్తున్నారు. అతనికి చెందిన పావనా లేక్ ఫామ్ హౌస్ లో హుక్కాను, యాష్ ట్రే లను,  కొన్ని మందులను కనుగొని వాటిని స్వాధీనం చేసుకున్నట్టు వారు తెలిపారు. ఈ ఫామ్ హౌస్ కి సుశాంత్ నెలకు రెండున్నర లక్షల రూపాయలు అద్దె చెల్లించేవాడట. తరచు బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇక్కడ పార్టీలు ఇచ్ఛేవాడని తెలిసింది. తన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, సిథ్దార్థ్ పితాని వగైరా మిత్రులతో ఉల్లాసంగా గడిపేవాడని తెలిసింది. తను డిప్రెషన్ తో బాధ పడుతూ, స్టెరాయిడ్స్ తీసుకుంటున్నా ఈ ఫామ్ హౌస్ ని  మాత్రం అందరూ ‘పావనం’ చేసేవారట. తాము డ్రగ్స్ తీసుకునే వారం కామని రియా, షోవిక్ మొదట బడాయి కబుర్లు చెప్పారు. కానీ.. ఇప్పుడంతా సీన్ పూర్తి రివర్స్ గా కనిపిస్తోంది.