రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌గా హరివంశ్ ఎన్నిక
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికైనట్లు సభా చైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికైనట్లు సభా చైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. మూజువాణి ఓటుతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగింది. హరివంశ్ పేరును ప్రతిపాదిస్తూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభలో మొదటి ప్రదిపాదన ప్రవేశపెట్టారు. అనంతరం ఎంపీ తార్వాచంద్ రెండవ ప్రతిపాదనగా సమర్థించారు. జేడీయూకు చెందిన నారాయణ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా వరుసగా రెండవసారి ఎన్నికయ్యారు. విపక్షాల తరపున ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా బరిలో నిలిచాడు.
హరివంశ్ ఎన్నికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ఆయన శక్తియుక్తులు ఎంతగానో ఉపయోగపడతాయని మోదీ ప్రశంసించారు. కాగా, విపక్ష నేత గులాంనబీ ఆజాద్.. నూతన డప్యూటీ చైర్మెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అన్ని పార్టీల అభ్యర్థని ఆజాద్ కొనియాడారు. పెద్దల సభకు గౌరవాన్ని తీసుకువస్తారని అశాభావం వ్యక్తం చేశారు.