‘పుష్ప’లో 6 నిమిషాల ఫైట్​కు ఊహించ‌ని బ‌డ్జెట్..!

'పుష్ప'లో 6 నిమిషాల ఫైట్​కు ఊహించ‌ని బ‌డ్జెట్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేషన్​లో రాబోతున్న‌ హ్యాట్రిక్​ సినిమా ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో ఈ మూవీ తెర‌కెక్క‌నున్న‌ట్లు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఆ విష‌యం ఫ‌స్ట్ లుక్ తోనే అర్థ‌మైపోయింది. కాగా ప్ర‌స్తుతం లాక్​డౌన్​ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఈ చిత్రంలోని కీలకమైన ఓ ఫైట్​ కోసం పెడుతున్న బడ్జెట్​ ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది. కరోనా నుంచి తేరుకుని..షూటింగ్ ప్రారంభిన […]

Ram Naramaneni

|

May 08, 2020 | 7:58 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేషన్​లో రాబోతున్న‌ హ్యాట్రిక్​ సినిమా ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో ఈ మూవీ తెర‌కెక్క‌నున్న‌ట్లు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఆ విష‌యం ఫ‌స్ట్ లుక్ తోనే అర్థ‌మైపోయింది. కాగా ప్ర‌స్తుతం లాక్​డౌన్​ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఈ చిత్రంలోని కీలకమైన ఓ ఫైట్​ కోసం పెడుతున్న బడ్జెట్​ ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది.

కరోనా నుంచి తేరుకుని..షూటింగ్ ప్రారంభిన అనంత‌రం బన్నీతో ఈ భారీ యాక్షన్​ సీక్వెన్స్​కు తీసేందుకు మూవీ టీమ్ ప్లానింగ్ చేస్తోంది​. 6 నిమిషాల నిడివి ఉండే ఈ సీన్ కోసం దాదాపు రూ.6 కోట్ల బడ్జెట్​ను నిర్ణయించారని వార్త‌లు వినిపిస్తున్నాయి. మొద‌ట‌ దీనిని విదేశీ స్టంట్​ కొరియోగ్రాఫర్స్​తో తీయాలని భావించినా, కరోనా ప్రభావం వల్ల ఆ నిర్ణ‌యం మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో స్వదేశీ స్టంట్​ కొరియోగ్రఫర్స్​తోనే ఈ ఫైట్​ను రూపొందించ‌నున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన‌ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా… దేవీశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu