వ‌చ్చే జ‌న్మ‌లో పెళ్లి చేసుకోమ‌ని అడిగిన నెటిజ‌న్ కు న‌టి అదిరిపోయే రిప్లై…

వ‌చ్చే జ‌న్మ‌లో పెళ్లి చేసుకోమ‌ని అడిగిన నెటిజ‌న్ కు న‌టి అదిరిపోయే రిప్లై...

ఆమె అందాల న‌టి…వ‌య‌సు 45 సంవ‌త్స‌రాలు..పెళ్లై పిల్ల‌లు ఉన్నారు. కానీ ఆమె అందంతో ఆడియెన్స్ మది దోచేస్తోంది. ఇక ఆమెను అభిమానించేవారు ఏం చేస్తారు. పెళ్లైంది కాబ‌ట్టి ఈ జ‌న్మకు మ‌న‌కు భాగ్యం లేదులే అని వ‌దిలేస్తారు. అయితే ఓ నెటిజ‌న్ మాత్రం ‘వచ్చే జన్మలోనైనా నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని ఓ నెటిజన్‌ బాలీవుడ్‌ నటి రవీనా టాండన్ ను సోష‌ల్ మీడియా వేదిక‌గా అడిగేశాడు. దానికి ఆమె చాలా ఫ‌న్నీగా ఆన్స‌ర్ ఇచ్చింది. ‘క్షమించండి. […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

May 08, 2020 | 8:32 PM

ఆమె అందాల న‌టి…వ‌య‌సు 45 సంవ‌త్స‌రాలు..పెళ్లై పిల్ల‌లు ఉన్నారు. కానీ ఆమె అందంతో ఆడియెన్స్ మది దోచేస్తోంది. ఇక ఆమెను అభిమానించేవారు ఏం చేస్తారు. పెళ్లైంది కాబ‌ట్టి ఈ జ‌న్మకు మ‌న‌కు భాగ్యం లేదులే అని వ‌దిలేస్తారు. అయితే ఓ నెటిజ‌న్ మాత్రం ‘వచ్చే జన్మలోనైనా నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని ఓ నెటిజన్‌ బాలీవుడ్‌ నటి రవీనా టాండన్ ను సోష‌ల్ మీడియా వేదిక‌గా అడిగేశాడు. దానికి ఆమె చాలా ఫ‌న్నీగా ఆన్స‌ర్ ఇచ్చింది. ‘క్షమించండి. మరో ఏడు జన్మల వరకు ఖాళీగా లేను’ అని చమత్కరించింది. గతంలో తాను ట్రిప్ కి వెళ్లిన ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఆమె ఓ క్యాప్షన్ ఇచ్చింది.

‘వేసవికాలం వేడిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏదైనా మంచు ప్రాంతాలకు ట్రిప్పుకు వెళ్లాలని నా మనసు కోరుకుంటుంది’ అని రాసుకొచ్చింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..వ‌చ్చే జ‌న్మ‌లో త‌న‌ను పెళ్లి చేసుకుంటారా అని అడిగిన ప్ర‌శ్న‌కు..భ‌లే ఫ‌న్నీగా ఆన్స‌ర్ ఇచ్చింది. ఈ న‌టి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్లు తెగ‌ ఫిదా అవుతున్నారు. ప్రజంట్ కన్నడ హీరో యశ్ నటిస్తోన్న ‘కేజీఎఫ్ 2’‌లో రవీనా టాండన్ కీలక పాత్ర పోషిస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu