RRR : నాటు నాటు పాట క్రెడిట్ అంతా అతనికే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజమౌళి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో చరణ్ మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమురం భీమ్ గా

RRR : నాటు నాటు పాట క్రెడిట్ అంతా అతనికే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజమౌళి
Rajamouli
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 21, 2023 | 5:58 PM

టాలీవుడ్ తోప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడమే కాదు అనేక రికార్డులను కూడా సొంతం చేసుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో చరణ్ మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమురం భీమ్ గా అద్భుతంగా నటించి అలరించారు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను స్నేహితులుగా మార్చి ఫిక్షనల్ కథతో ఈ సినిమాను రూపొందించారు జక్కన్న . ఇక ఈ సినిమా ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా కీర్తిని పెంచేసింది. జపాన్ లోనూ విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గ్లోబల్ అవార్డు దక్కగా ఆస్కార్ నామినెన్షన్ లో కూడా ఈ పాట నామినేట్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ పాట క్రెడిట్ అంతా రాజమౌళికి సంగీత దర్శకుడికి మాత్రమే దక్కుతోందని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. గత కొద్దీ రోజులుగా ఈ ట్రోల్స్ ఎక్కువ కావడంతో దీని పై రాజమౌళి స్పందించారు. ఈ సినిమాలోని నాటు నాటు పాట క్రెడిట్ అంతా ప్రేమ్ రక్షిత్ కే దక్కుతుందని అన్నారు రాజమౌళి.

ప్రస్తుతం వరుసగా ఆంగ్ల పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తోన్న రాజమౌళి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ నాటు నాటు పాట కోసం ప్రేమ్ రక్షిత్ చాలా కష్టపడ్డారు అని అన్నారు. అతను అంత ఎఫర్ట్స్ పెట్టాడు కాబట్టే ఆ పాటకు అంతటి గౌరవం దక్కిందని అన్నారు రాజమౌళి. అలాగే  రామ్ చరణ్ ను తారక్ బుజాల పై ఎత్తుకొని చేసే ఫైట్ కూడా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫ్ చేశారని అన్నారు రాజమౌళి.