Ram Charan: చరణ్, బుచ్చిబాబు మూవీలో హీరోయిన్‌గా ఈ బ్యూటీ ఫిక్స్ అయ్యిందా.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న చరణ్.. ఇప్పుడు శంకర్ తోనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న చరణ్.. ఇప్పుడు శంకర్ తోనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అలాగే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కూడా సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.. మొన్నామధ్య బుచ్చిబాబు సినిమా గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా.. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తోనూ మరో లవ్ స్టోరీ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. శంకర్ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది ఈ సినిమాలో చరణ్ కు జోడీగా అందాల భామ మృణాల్ ఠాకూర్ నటిస్తుందని అంటున్నారు. మరునాళ్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే..
హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మృణాల్. అందం అభినయం కలబోసిన మృణాల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు నాని తో కలిసి ఒక సినిమా చేస్తుంది. దానితో పాటే ఇప్పుడు రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
View this post on Instagram