AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: దొరికేసిందిరోయ్.. వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమాలో బ్లాక్ బస్టర్ హీరోయిన్..

ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది ఓ హీరోయిన్. కన్నడకు చెందిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది ఈ బ్యూటీ. ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ జోష్ మీద దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Venkatesh: దొరికేసిందిరోయ్.. వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమాలో బ్లాక్ బస్టర్ హీరోయిన్..
Venkatesh, Trivikram
Rajitha Chanti
|

Updated on: Oct 22, 2025 | 1:13 PM

Share

ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేశ్. ఈ సినిమా తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిన వెంకీ.. ఇటీవలే తన కొత్త సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ తన కొత్త సినిమాను చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. #Venky77 #VenkateshXTrivikram అనే వర్కింగ్ టైటిల్స్ తో రానున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి ఫిల్మ్ వర్గాల్లో రోజుకో న్యూస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలో వెంకీ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని ప్రచారం నడుస్తుంది. ఇందులో సీనియర్ హీరోయిన్ త్రిష నటించనుందని టాక్ వినిపిస్తుంది. అలాగే ఆమెతోపాటు శ్రీనిధి శెట్టి, నిధి అగర్వాల్ పేర్లు తెర పైకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కేజీఎఫ్ మూవీతో కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది శ్రీనిధి శెట్టి . ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కన్నడ, తమిళంలో పలు చిత్రాల్లో నటించిన శ్రీనిధి.. ఇప్పుడు తెలుగులో హిట్ 3, తెలుసు కదా సినిమాల్లో నటించి వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంది.

ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?

ఇక ఇప్పుడు త్రివిక్రమ్, వెంకీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో నటిస్తుంది. ఇందులో శ్రీనిధితోపాటు అటు సీనియర్ హీరోయిన్ త్రిష సైతం కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరోవైపు శ్రీనిధికి తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?

ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..