AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 2025లో థియేటర్లలో అట్టర్ ప్లాప్.. 2026లో బ్లాక్ బస్టర్ హిట్.. నెట్టింట సంచలనం ఈ సినిమా..

2025 చివరిలో థియేటర్లలో అనేక సినిమాలు విడుదలయ్యాయి. చిన్న, పెద్ద చిత్రాలు భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చాయి. కొత్త ఏడాది ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా గురించి మీకు తెలుసా.. ? థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయిన ఆ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతుంది.

Cinema : 2025లో థియేటర్లలో అట్టర్ ప్లాప్.. 2026లో బ్లాక్ బస్టర్ హిట్.. నెట్టింట సంచలనం ఈ సినిమా..
Cinema
Rajitha Chanti
|

Updated on: Jan 16, 2026 | 9:43 PM

Share

గతేడాది థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయిన ఓ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. దాదాపు 2 గంటల 26 నిమిషాల నిడివి గల ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందామా. మనం మాట్లాడుకుంటున్న ఈ మూవీ పేరు ‘దే దే ప్యార్ దే 2’ . బాలీవుడ్ డైరెక్టర్ అన్షుల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆర్. మాధవన్, గౌతమి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. జావేద్ జాఫ్రీ, మీజాన్ జాఫ్రీ కూడా నటించారు. ఈ చిత్రం నవంబర్ 14, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా కథ మొదటి భాగం ముగిసిన చోట నుండి మొదలవుతుంది. 2019లో అదే పేరుతో వచ్చిన మొదటి భాగం. ఇందులో అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ తో ప్రేమలో పడటం చూపిస్తుంది. అజయ్ కి ఇద్దరు పిల్లలు, ఒక భార్య ఉన్నారు.కానీ భార్యతో విడాకులు తీసుకోకుండానే ఒంటరిగా ఉంటాడు.

ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?

రకుల్ అజయ్ ని తన కుటుంబాన్ని కలవడానికి తీసుకెళ్తాడు. ఈ చిత్రంలో, రకుల్ తల్లిదండ్రులుగా ఆర్. మాధవన్, గౌతమి కపూర్ నటించారు. ఆర్. మాధవన్ అజయ్ కంటే ఒకటి లేదా రెండు సంవత్సరాలు చిన్నవాడు. రకుల్ అజయ్ కంటే చాలా పెద్దదని తెలుసుకున్నప్పుడు ఆమెను మార్చేందుకు ప్రయత్నిస్తారు.

ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..

“దే దే ప్యార్ దే” మొదటి భాగం బడ్జెట్ 40-50 కోట్ల రూపాయలు. అయితే, ఆ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి హిట్ అయింది. రెండవ భాగం, “దే దే ప్యార్ దే 2” బడ్జెట్ 135-150 కోట్ల రూపాయలు. కానీ ఈసినిమా , కేవలం 129 కోట్ల రూపాయలు మాత్రమే సంపాదించింది. జనవరి 9న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈమూవీ ట్రెండింగ్ నంబర్ 1లో దూసుకుపోతుంది.

ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‏కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..