Bhala Thandanana: మరో ఇంట్రస్టింగ్ మూవీతో రానున్న శ్రీవిష్ణు.. ‘భళా తందనాన’ రిలీజ్ ఎప్పుడంటే

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు.

Bhala Thandanana: మరో ఇంట్రస్టింగ్ మూవీతో రానున్న శ్రీవిష్ణు.. 'భళా తందనాన' రిలీజ్ ఎప్పుడంటే
Bhala Thandanana
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 23, 2022 | 8:00 AM

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ‘భళా తందనాన'(Bhala Thandanana) అనే సినిమాతో రానున్నాడు. ఇప్పటికే టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది ఈ టీజర్. ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి ఈ చిత్రాని దర్శకత్వం వహిస్తుండగా.. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి రెండు లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది.

టీజర్, లిరికల్ వీడియోలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ‘భళా తందనాన’ చిత్ర విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం విడుదల కానుంది. వేసవి సెలవులను ద్రుష్టిలో పెట్టుకొని వచ్చే వారంలోనే చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. అలాగే మే 3న రంజాన్ పండగ కూడా సినిమాకు మరో అడ్వాంటేజ్ కానుంది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా కథానాయికగా నటించింది. శ్రీకాంత్ విస్సా రచయిత గా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన ఈ చిత్రానికి టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ స్టంట్స్ అందించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :  

Aamna Sharif: అందాలతో ఫ్యాన్స్ హృదయాలను లాక్ చేస్తున్న ఆమ్నా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

Meenakshi Chaudhary:పింక్ శారీ లో పిచ్చెకిస్తున్న మీనాక్షి.. ఇంత అందానికి ఫిదా కానీ వారుంటారా

Acharya: ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్.. రేపు యూసఫ్ గూడ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..