AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sree Vishnu: జూనియర్‌ ఎన్టీఆర్ అభిమానిగా శ్రీ విష్ణు.. ఆసక్తికరంగా ‘అర్జున ఫల్గుణ’ ట్రైలర్‌..

ఇటీవల ‘రాజ రాజా చోర’గా మెప్పించిన శ్రీ విష్ణు త్వరలో ‘ అర్జున ఫల్గుణ’ సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా

Sree Vishnu: జూనియర్‌ ఎన్టీఆర్ అభిమానిగా శ్రీ విష్ణు.. ఆసక్తికరంగా ‘అర్జున ఫల్గుణ’ ట్రైలర్‌..
Basha Shek
|

Updated on: Dec 24, 2021 | 8:30 PM

Share

ఇటీవల ‘రాజ రాజా చోర’గా మెప్పించిన శ్రీ విష్ణు త్వరలో ‘ అర్జున ఫల్గుణ’ సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ ఏడాదిలో చివరిగా విడుదల కానున్న సినిమా ఇదే కావడం విశేషం. విడుదలకు వారం రోజులే సమయం ఉండడంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసే పనిలో ఉంది చిత్రబృందం. ఇప్పటికే పోస్టర్లు, పాటలు, టీజర్లు రిలీజ్ చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన మూవీ యూనిట్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రముఖ డైరెక్టర్‌ కొరటాల శివ చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ రిలీజైంది.

కాగా ట్రైలర్‌ చూస్తుంటే ఇందులో శ్రీ విష్ణు యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా కనిపించాడు. ఎన్టీఆర్‌ కటౌట్‌కు ముందు డ్యాన్స్ వేయడాలు, తనతో పాటు తన స్నేహితులను ‘ఆది’, ‘రాఖీ,’ ‘సింహాద్రి’, ‘యమదొంగ’ ఎన్టీఆర్‌ సినిమా పేర్లతో పిలవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్‌లో ఇంకా ఎన్నాళ్లూ ఖాళీగా ఉంటావని అడిగితే.. ‘డిగ్రీదాకా కష్టపడి చదివాం.. ఓ ఆర్నేళ్లు రెస్ట్‌ తీసుకుంటే తప్పా’ అని శ్రీ విష్ణు చెప్పిన డైలాగులు బాగా పేలాయి. ఈసినిమాలో ‘రెడ్‌’, ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’, సినిమాలతో మెప్పించిన అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఆమె గ్రామ వాలంటీర్‌గా కనిపించనుంది. ఆమెతో పాటు నరేశ్‌, సుబ్బరాజు, మహేశ్‌, శివాజీ రాజా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో తేజ మార్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నిరంజన్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా ప్రియదర్శన్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. ‘అర్జున ఫల్గుణ’తో పాటు ‘భళా తందనాన’ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు శ్రీ విష్ణు.

Also Read:

Telugu Actress: కళ్లతోనే మాయ చేస్తోన్న.. ఈ క్రేజీ బ్యూటీ ఎవరో కనిపెట్టగలరా..?

Samantha: వరుణ్ ధావన్ తో జోడీ కట్టనున్న సామ్‌.. స్టైలిష్‌ స్పై ఏజెంట్లుగా మెప్పించనున్న క్రేజీ కాంబో..

Anand Mahindra: ఆఫ్రికన్‌ అన్నాచెల్లెళ్ల ప్రతిభకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా.. ట్విట్టర్‌లో ఏం చెప్పారంటే..