Samantha: వరుణ్ ధావన్ తో జోడీ కట్టనున్న సామ్.. స్టైలిష్ స్పై ఏజెంట్లుగా మెప్పించనున్న క్రేజీ కాంబో..
ఈ ఏడాది జూన్‌లో 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో అద్భుతంగా నటించి ప్రశంసలందుకున్న సమంత.. 'పుష్ప’లో స్పెషల్ సాంగ్‌తో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. ప్రస్తుతం ఆమె చేతిలో

ఈ ఏడాది జూన్‌లో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో అద్భుతంగా నటించి ప్రశంసలందుకున్న సమంత.. ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్‌తో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘శాకుంతలం’, ‘యశోద’ చిత్రాలతో బిజీగా ఉన్న సామ్ నయన్‌తో కలిసి ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. వీటితో పాటు ఓ అంతర్జాతీయ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపింది. ఇలా చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న సామ్ మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ప్రాజెక్టకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌ధావన్‌తో కలిసి ఆమె ‘సిటాడెల్’ అనే ఓ సిరీస్‌లో నటించనుంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్- డీకేలు ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇక హాలీవుడ్‌లో ‘అవెంజర్స్’ లాంటి సూపర్ హీరో చిత్రాలకు రూపొందించిన రుసో బ్రదర్స్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తుండడం విశేషం.
స్టైలిష్ స్పై ఏజెంట్లుగా.. కాగా ‘సిటాడెల్’ పేరుతో అమెరికాలోనూ ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటి ప్రియాంక ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీన్ని కూడా రుసో బ్రదర్స్ రూపొందిస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో ఇండియన్ సినిమా ప్రేక్షకుల కోసం కొన్ని మార్పులతో ఆ యాక్షన్ సిరీస్‌ను వరుణ్, సమంతతో కలిసి తెరకెక్కిస్తున్నారని సమాచారం. కాగా ‘సిటాడెల్’ సిరీస్‌లో వరుణ్, సమంతలు స్పై ఏజెంట్లు(గూఢచారులు)గా నటించనున్నారు. అవి కూడా ఎంతో స్టైలిష్‌గా డిజైన్ చేశారట. వచ్చే ఏడాది ఈ సిరీస్ పట్టాలెక్కనుంది. అయితే సెట్స్‌పైకి వెళ్లేముందే వరుణ్, సమంతలు ఓ వర్క్‌షాపులో పాల్గొననున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నారు.
Rajinikanth: మరోసారి మంచి మనసు చాటుకున్న తలైవా.. అన్నాత్తై టెక్నీషియన్లకు సర్‌ప్రైజ్ గిఫ్ట్స్..
83 Movie: అమ్మా ప్రపంచకప్ గెలిచేశాం.. 83 సినిమా సక్సెస్‌పై రణ్‌వీర్ సింగ్ ఎమోషనల్ పోస్ట్..




