AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South Indian Actresses: కంగనా రనౌత్‌ బాటలో కొందరు సౌత్‌ హీరోయిన్స్‌

తెర మీదే కాదు...వివాదాల తెర మీద కూడా హీరోయిన్లుగా వెలిగిపోతున్నారు. కంగనా రనౌత్‌ని మించి వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నారు కొందరు సౌత్‌ హీరోయిన్లు. మొన్న కస్తూరి, నిన్న నయనతార...అంతకుముందు సాయిపల్లవి. కదిలిస్తే చాలు కాంట్రోవర్సీ క్వీన్స్‌గా మారుతున్నారు.

South Indian Actresses: కంగనా రనౌత్‌ బాటలో కొందరు సౌత్‌ హీరోయిన్స్‌
Kasthuri - Nayanthara - Sai Pallavi
Ram Naramaneni
|

Updated on: Nov 18, 2024 | 9:35 AM

Share

వాళ్లకు వివాదాలు ఇష్టమో…వివాదాలకు వాళ్లు ఇష్టమో తెలియదు కానీ, కాంట్రోవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నారు కొందరు హీరోయిన్స్‌. తెర మీద కావాల్సినంత యాక్షన్‌తో సరిపెట్టడం లేదు. వాళ్ల డైలాగులతో తెర వెనుక కూడా వివాదాల రియాక్షన్‌ చెలరేగుతోంది.

ధనుష్‌ని రప్ఫాడించిన నయనతార

నువ్వింత దిగజారుతావు అనుకోలేదు అంటూ లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో ధనుష్‌ని రప్ఫాడించింది లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార. తన పెళ్లి, కెరీర్, లైఫ్ గురించి బయోపిక్ తరహాలో డాక్యుమెంటరీని రూపొందించింది ఈ తార. నానుమ్ రౌడీ దాన్ చిత్రం నుంచి 3 సెకండ్ల వీడియోను డాక్యుమెంటరీలో వాడారు. తన అనుమతి లేకుండా వీడియో ఉపయోగించడంపై, ప్రొడ్యూసర్‌ ధనుష్‌ సీరియస్‌ అవడంతో పాటు, నయనతారపై రూ. 10 కోట్లకు కాపీ రైట్‌ కేసు వేశారు. తెర వెనుక చర్చలు ఫలించకపోవడంతో…తెర పైన రచ్చ రాజుకుంది. ధనుష్‌పై ఏకంగా 3 పేజీల పోస్టుతో విరుచుకుపడింది నయన్‌. ఈ ఎపిసోడ్‌ కోలీవుడ్‌లోనే కాదు, అన్ని భాషల వెండి తెరలపై వివాదాస్పద చిత్రంగా మారింది.

ధనుష్‌ పగతోనే ఇలా చేశాడన్న నయనతార

ప్రముఖ వ్యక్తి కొడుకుగా, ప్రముఖ డైరెక్టర్ సోదరుడిగా ఇండస్ట్రీలోకి వచ్చావు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒంటరి పోరాటంతో నేను నిలబడ్డా. నీకు గతం నుంచి నాపై పగ ఉందని తెలుసు. కానీ ఈ స్థాయిలో నీచ బుద్ధిని బయటపెడతావని అనుకోలేదు. కేవలం 3 సెకండ్ల క్లిప్ కోసం 10 కోట్లకు కాపీరైట్ కేసు వేశావంటే..నువ్వు ఎంతగా దిగజారిపోయావో అర్థం అవుతోందంటూ ధనుష్‌కి లెఫ్ట్‌ రైట్‌ వాయించేసింది నయన్‌.

తెలుగువాళ్లపై కస్తూరి అనుచిత కామెంట్స్‌

ఇక ఆ మధ్య తమిళనాడులో బ్రాహ్మణ సంఘాల సమ్మేళనంలో పాల్గొన్న నటి కస్తూరి.. తెలుగువాళ్లపై అనుచిత కామెంట్స్ చేశారు. రాజులకు అంతఃపురంలో సేవలు చేసేందుకు 300ఏళ్ల క్రితం తెలుగువాళ్లు వచ్చారని..ఇప్పుడు వాళ్లంతా తమది తమిళ జాతి అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చినవాళ్లే తమిళులు అయినప్పుడు.. ఎప్పటినుంచో ఇక్కడ ఉంటున్న బ్రాహ్మణులు తమిళులు కాదా అని ప్రశ్నించారు. కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

రజనీపై నోరు పారేసుకున్న కస్తూరి

నోరు జారిన కస్తూరి చివరకు జైలు పాలయింది. ఇంటింటి గృహలక్ష్మిగా తెలుగు లోగిళ్లకు పరిచయమున్న కస్తూరి.. నోరు జారడం ఇదే తొలిసారి కాదు. తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ పొలిటికల్ పొటెన్షియల్‌నే నేరుగా ప్రశ్నించి..తలైవా ఫ్యాన్స్‌నే ఢీకొట్టింది కస్తూరి. తర్వాత అజిత్ ఫ్యాన్స్ కోపానిక్కూడా గురైంది. డర్టీ కస్తూరి ఆంటీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆమెపై భీకరమైన ట్రోలింగ్ జరిగింది.

ఇండియన్‌ ఆర్మీపై వివాదాస్పద వ్యాఖ్యలు

భారత సైన్యాన్ని టెర్రరిస్టులుగా పాకిస్తానీలు భావిస్తారని, వాళ్ల ఆర్మీని కూడా మనవాళ్లు అలాగే అనుకుంటారంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హీరోయిన్‌ సాయి పల్లవి. అమరన్‌ మూవీ విడుదల సందర్భంగా గతంలో ఆమె చేసిన కాంట్రోవర్సీ కామెంట్లు మరోసారి తెర పైకి వచ్చి కలకలం రేపాయి కాంట్రోవర్సీలు.. ఊ అంటావా భామా అంటే…ఊఊ అంటున్నారు కొంతమంది హీరోయిన్లు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..