Ram Charan: కడప గడ్డపై కాలు మోపనున్న గ్లోబల్ స్టార్.. ఫ్యాన్స్‌కి ఊహించని ఫీస్ట్
కడపలో ఇవాళ సందడి చేయబోతున్నారు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్. సోమవారం సాయంత్రం కడప గడ్డపై అడుగుపెట్టనున్న గ్లోబల్ స్టార్.. ఫ్యాన్స్‌కి ఊహించని ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...
గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్ వేళ.. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కడప టూర్ ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతోంది. కడప పెద్ద దర్గాను దర్శించుకోబోతున్న చెర్రీ.. ఆ తర్వాత ఉరుసు ఉత్సవాలకు హాజరవుతారు. అమీన్‌పీర్ దర్గా 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నారు రామ్‌చరణ్. ఇందుకోసం, హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయల్దేరి వెళ్లనున్నారు. సాయంత్రం ఐదున్నర గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి.. ఈవ్‌నింగ్ ఆరున్నరకు కడపలో ల్యాండ్ అవుతారు చరణ్. కడప ఎయిర్‌పోర్ట్ నుంచి ఈవెంట్ ప్లేస్ వరకు భారీ ర్యాలీగా వెళ్తారు. రామ్‌చరణ్ వస్తుండటంతో పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు ఈవెంట్ నిర్వాహకులు. చరణ్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో.. అందుకు తగ్గట్టుగా అరేంజ్‌మెంట్స్ జరుగుతున్నాయ్. గజల్ ఈవెంట్ దగ్గర ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు.
Few Hours to go 🔥💥 Ceeded will Erupted for Sure 🥵@AlwaysRamCharan #RamCharan #GameChanger #Kadapapic.twitter.com/oXTaRxsrTc
— Bharath RC Kajuu 🚁 (@BharathRCKajal) November 17, 2024
శనివారం మొదలైన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు.. ఈనెల 20వరకు సాగనున్నాయ్. మొదటి రోజు గంధం కార్యక్రమం నిర్వహించగా.. తర్వాత రోజు ఉరుసు ఉత్సవం జరిగింది. గంధం మహోత్సవం ఈవెంట్‌కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ హాజరయ్యారు. కుటుంబంతో కలిసి గంధం కార్యక్రమంలో పాల్గొన్నారు ఏఆర్ రెహ్మాన్. ఇక, ఇవాళ జరిగే ముషాయిరా గజల్ ఈవెంట్‌కి ముఖ్యఅతిథిగా రాబోతున్నారు రామ్‌చరణ్. చివరిగా, ఈనెల 20వ తేదీ రాత్రి పది గంటలకు నిర్వహించే ఊరేగింపుతో కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ముగుస్తాయ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.