Sonali Bendre: క్యాన్సర్‏తో పోరాడి గెలిచిన మహేష్ హీరోయిన్.. పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సోనాలి..

మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అమాయకమైన తన నటనతో యూత్ గుండెలను దొచేసింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించింది. మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర, నాగార్జునతో మన్మథుడు, శంకర్ దాదా వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ పలు మూవీస్ చేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బాలీవుడ్ నిర్మాత గోల్డీ బెహ్ల్ ను వివాహం చేసుకున్నరాు. వీరికి 2005లో బాబు జన్మించాడు. బాబు పుట్టిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.

Sonali Bendre: క్యాన్సర్‏తో పోరాడి గెలిచిన మహేష్ హీరోయిన్.. పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సోనాలి..
Sonali Bendre
Follow us

|

Updated on: Apr 25, 2024 | 7:59 AM

సోనాలి బింద్రే.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈ తరం అడియన్స్‏కు ఆమె గురించి అంతగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు సౌత్ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన కలల రాకూమారి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్‏గా కొనసాగింది. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి సినిమాలో హమ్మా హమ్మా పాటతో సౌత్ ఇండియాలో ఫేమస్ అయ్యింది. ఈ పాట సోనాలి కెరీర్ కు మంచి బ్రేక్ వచ్చింది. ఒకవేళ ఈ సాంగ్ హిట్ కాకపోతే సినీ పరిశ్రమను వదిలేయాలని ఫిక్స్ అయ్యిందట ఈ బ్యూటీ. మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అమాయకమైన తన నటనతో యూత్ గుండెలను దొచేసింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించింది. మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర, నాగార్జునతో మన్మథుడు, శంకర్ దాదా వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ పలు మూవీస్ చేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బాలీవుడ్ నిర్మాత గోల్డీ బెహ్ల్ ను వివాహం చేసుకున్నరాు. వీరికి 2005లో బాబు జన్మించాడు. బాబు పుట్టిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.

2013లో చివరిసారాగ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత గాట్ టాలెంట్, ఇండియాస్ బెస్ట్ డ్రామేబాజ్, టెలివిజన్ సిరీస్ అజీబ్ దాస్తాన్ హై యే వంటి రియాల్టీ షోలలో జడ్జీగా కనిపించింది. 2018లో క్యాన్సర్ బారనన పడింది. కొన్నాళ్లపాటు న్యూయార్క్ లో క్యాన్సర్ చికిత్స తీసుకుని కోలుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై సందడి చేసిన ఆమె.. ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు ది బ్రోకెన్ న్యూస్ విజన్ 2 వెబ్ సిరీస్ లో నటించింది. జీ5లో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తన లైఫ్, ఫ్యామిలీ, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఇంటర్ చదువుతున్న సమయంలోనే తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయిన కుటుంబం కోసమే సినిమాల్లోకి అడుగుపెట్టినట్లు తెలిపింది. సినిమాల్లోకి వచ్చాక తన డాన్స్ పై చాలా విమర్శలు వచ్చాయని.. చాలామంది కొరియోగ్రాఫర్స్ తిట్టేవారని తెలిపింది. ఆ సమయంలో డాన్స్ రాకపోతే హీరోయిన్ కాలేరని ఒక నమ్మకం ఉండేదని.. దీంతో షూట్ అయిన వెంటనే బాలీవుడ్ డాన్స్ శిక్షణ తీసుకునేదాన్ని అన్నారు. ఐదు సినిమాల తర్వాత హమ్మా హమ్మా సాంగ్ ఆఫర్ వచ్చిందని.. ఆ పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్ అని.. అతడి సోదరుడు రాజు సుందరం పక్కన డాన్స్ చేయాలని.. ప్రభుదేవ కొరియోగ్రఫీ కావడంతో ఎంతో కష్టపడి ఆ సాంగ్ చేసినట్లు తెలిపారు. ఒకవేళ ఆ పాట చేయలేకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నారట. ఇక ప్రస్తుతం తనకు డబ్బు అవసరం ఉందని.. అందుకే తిరిగి సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపింది. తన కుటుంబం క్లిష్టమైన ఇబ్బందులను ఎదుర్కొంటుందని.. ఇప్పుడు తన వయసుకు తగిన పాత్రలు వస్తే చేసేందుకు రెడీగా ఉన్నానని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles