Ayalaan teaser: ‘ఏలియన్’తో కలిసి నవ్వించేందుకు రెడీ అయిన శివకార్తికేయన్.. ‘అయాలన్’ టీజర్ చూశారా ?..
కొద్ది రోజుల క్రితం ప్రిన్స్ సినిమాతో నేరుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు శివకార్తికేయన్. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా అయాలన్. ఎప్పుడూ డిఫరెంట్ కథాంశాలతో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. ఇప్పుడు ఏలియన్తో కలిసి కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యాడు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా అయాలన్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు.

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ సినిమాల కోసం తెలుగు అడియన్స్ సైతం ఎదురుచూస్తుంటారు. రెమో సినిమా నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో అతనికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత అతను నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రిన్స్ సినిమాతో నేరుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు శివకార్తికేయన్. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా అయాలన్. ఎప్పుడూ డిఫరెంట్ కథాంశాలతో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. ఇప్పుడు ఏలియన్తో కలిసి కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యాడు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా అయాలన్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు.
గ్రహాంతర-సైన్స్ ఫిక్షన్‌గా రూపొందించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, యోగిబాబు, భానుప్రియ, శరత్ కేల్కర్ కీలకపాత్రలు పోషించారు. టీజర్ ప్రారంభంలో ‘వాతావరణ మార్పు’కు సంబంధించిన సన్నివేశం ఉంది. ఓ పల్లెటూరిలో వ్యవసాయం చేసుకుంటూ స్నేహితులతో కలిసి ఉండే ఓ కుర్రాడికి (శివకార్తికేయన్)కు ఆ ఊరిలోకి వచ్చిన ఏలియన్ తో ఫ్రెండ్ షిప్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ ఏలియన్ ఆ ముగ్గురితో కలిసి ఉంటుంది. ఏలియన్, యోగిబాబు, శివకార్తికేయన్ కామెడీ నవ్వించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. అలాగే గ్రాఫిక్స్ బాగున్నాయి.
View this post on Instagram
అయాలన్ సినిమాను 24AM స్టూడియోస్, KJR స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలో వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత హీరోయిన్ రకుల్ ఈ సినిమాతో తెలుగు తెరపై సందడి చేయబోతుంది. ఈ సినిమాలో రెండు విభిన్న పరిస్థితులను డైరెక్టర్ సృష్టించినట్లుగా తెలుస్తోంది. అందులో ఓ ప్రపంచం చాలా అధునాతనమైనది.. మరో ప్రపంచం పల్లెటూరు చుట్టూ తిరుగుతుంది. ఈ రెండు విభిన్న ప్రపంచానలను ఎలా కలిపేలా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారో చూడాలి.\
We are super elated to present you all, our #AyalaanTeaser 👽❤️
Tamil: https://t.co/KzDSCt10Fp Telugu: https://t.co/ZMQOOcuuJn#Ayalaan #AyalaanFromPongal #AyalaanFromSankranti @Siva_Kartikeyan @Ravikumar_Dir @arrahman @kjr_studios pic.twitter.com/BIgOECgOVU
— 24AM STUDIOS (@24AMSTUDIOS) October 6, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
