Bigg Boss 7: ప్రిపేర్ అయి వచ్చిన నాగ్‌ను డామినేట్ చేసిన శివాజీ..
ఏంట్రా వీళ్లు.. ఇలా చేస్తే రేపు పెళ్లి చేసుకునేవాడు భయపడతాడు కదా అని శోభను ఉద్దేశించి.. శివాజీ మాట్లాడాడు. ఆ వీడియో చూపించిన నాగార్జున ఇదేంటని ప్రశ్నించాడు. వాళ్ల జీవితం.. వాళ్ల భవిష్యత్తు.. మనకెందుకు అని లాజిక్‌తో కొట్టే ప్రయత్నం చేశాడు. నా జోలికొస్తే ఊరుకుంటానా అని శివాజీ రివర్స్ కౌంటరిచ్చాడు.

బిగ్ బాస్ సీజన్ 7 చివరి అంకానికి చేరుకుంది. అయితే ఇన్నాళ్లు నాగ్ హోస్టింగ్‌ని మెచ్చుకున్నవాళ్లంతా ఈ శనివారం ఎపిసోడ్‌లో ఆయన ప్రవర్తనను చూసి అవాక్కయ్యారు. బిగ్ బాస్ ఇంట్లోని కంటెస్టెంట్స్ మధ్య వాదోపవాదనలు జరుగుతాయి. కొన్నిసార్లు బ్యాలెన్స్ తప్పుతారు. వారిని హోస్ట్ ట్రాక్‌లోకి తీసుకురావాలి. కానీ కంటెస్టెంట్స్ అన్న మాటలను తిరిగి నాగర్జున పదే, పదే ఉచ్చరించి వారికి బుద్ది చెప్పాలనుకోవడం వింతగా అనిపించింది. శనివారం ఎపిసోడ్‌లో అలాంటి సందర్భాలు చాలా ఎదురయ్యాయి. ఎందుకో కానీ ఈ వారం నాగార్జున బ్యాలెన్స్ తప్పినట్లు అనిపించింది. ప్రేక్షకులు, ప్రేక్షకులు అంటూ పాత పాటే పాడుతూ ఆడియెన్స్‌ను అడ్డు పెట్టుకుని.. తన ముచ్చట తీర్చేసుకున్నట్లు చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగా ప్రేక్షకులు అభిప్రాయాన్ని గౌరవించేవాళ్లే అయితే శోభా శెట్టి ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేది. ఆమెకు ఉన్న నెగిటివిటీకి ఇన్ని రోజులు అసలు ఎవరు ఓట్లు వేశారు అనేది ఆశ్యర్యం కలిగించే అంశం.
ఇక శివాజీ విషయంలో అయితే సీన్ మరింత రివర్స్ అయ్యింది. బయట సినిమాల్లో, రాజకీయాల్లో ఎన్నో ఢక్కాముక్కీలు తిని ఉన్నాడు శివాజీ. తనని లాక్ చేయాలనుకుంటే వదులుతాడా..? అవుతల ఉంది హోస్ట్ నాగార్జున అయినా సరే అస్సలు తగ్గలేదు. తాను శోభాను ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్‌గా అన్న మాటను.. బయట ఆడపిల్లలు అందరికీ ఆపాదించి చెప్పడం పట్ల గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు శివాజీ. తాను మాట్లాడింది పొరపాటే కానీ.. జనరలైజ్ ఎందుకు చేస్తున్నారంటూ కడిగిపారేశాడు.
ఏంట్రా వీళ్లు.. ఇలా చేస్తే రేపు పెళ్లి చేసుకునేవాడు భయపడతాడు కదా అని శోభను ఉద్దేశించి.. శివాజీ మాట్లాడాడు. ఆ వీడియో చూపించిన నాగార్జున ఇదేంటని ప్రశ్నించాడు. వాళ్ల జీవితం.. వాళ్ల భవిష్యత్తు.. మనకెందుకు అని లాజిక్‌తో కొట్టే ప్రయత్నం చేశాడు. నా జోలికొస్తే ఊరుకుంటానా అని శివాజీ రివర్స్ కౌంటరిచ్చాడు. అంటే నీ జోలికొస్తే మాట్లాడెస్తావా.. అని నాగ్ అడిగితే.. ఇంక ఏం చేయాలి బాబు గారు ఇంట్లో సైలెంట్‌గా కూర్చోమంటే అదే చేస్తానని చెప్పుకొచ్చాడు. మరి నీ మాటలు విని వాళ్లని పెళ్లి చేసుకోవాల్సిన వాళ్లు నిర్ణయం మార్చుకుంటే.. అని నాగ్ మరో పాయింట్ పట్టాడు. మరి వాళ్లు ప్రవర్తించిన విధానం చూసి మార్చుకోరా అండి.. అంటూ దిమ్మతిరిగే లాజిక్ లాగాడు శివాజీ. నాగార్జున ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. వాళ్లిద్దరికీ నువ్వు క్షమాపణ చెప్పాలి.. నేను నీ ప్లేస్‌లో ఉంటే సారీ చెబుతాను.. మరి నీ ఇష్టమంటూ నాగ్.. శివాజీని వెళ్లిపోమన్నారు. దీంతో సరే బాబు గారు అని బయటికొచ్చి శోభ, ప్రియాంకలకు అసంతృప్తిగానే సారీ చెప్పేశాడు శివాజీ. అంత పక్కాగా ప్రిపేర్ అయి వచ్చిన నాగ్‌ను కూడా చాలా చోట్ల డామినేట్ చేయడం మాత్రం కనిపించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
