AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Month Of Madhu: ఓటీటీలోకి వచ్చేసిన ఫీల్ గుడ్ మూవీ ‘మంత్ ఆఫ్ మధు’.. ఈసారి ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు చిత్రాలు చేసిన స్వాతి.. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. ఇక పెళ్లి తర్వాత స్వాతి సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది. చాలా కాలం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా మంత్ ఆఫ్ మధు. ఇందులో హీరో నవీన్ చంద్ర మెయిన్ రోల్ పోషించగా.. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలకు ముందే పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‏తో క్యూరియాసిటిని కలిగించింది.

Month Of Madhu: ఓటీటీలోకి వచ్చేసిన ఫీల్ గుడ్ మూవీ 'మంత్ ఆఫ్ మధు'.. ఈసారి ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
Month Of Madhu
Rajitha Chanti
|

Updated on: Dec 10, 2023 | 3:30 PM

Share

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ కలర్స్ స్వాతి. అష్టాచెమ్మా సినిమాతో కథానాయికగా వెండితెరపై సందడి చేసింది. ఈ చిత్రంలో స్వాతి నటన.. అమాయకత్వం, అల్లరికి అడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో స్వాతికి బోలెడంత క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత స్వామిరారా, కార్తికేయ, గోల్కొండ హైస్కూల్ చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు చిత్రాలు చేసిన స్వాతి.. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. ఇక పెళ్లి తర్వాత స్వాతి సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది. చాలా కాలం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా మంత్ ఆఫ్ మధు. ఇందులో హీరో నవీన్ చంద్ర మెయిన్ రోల్ పోషించగా.. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలకు ముందే పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‏తో క్యూరియాసిటిని కలిగించింది.

అక్టోబర్ 6న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. స్వాతి, నవీన్ చంద్ర నటనకు ప్రశంసలు అందుకున్నారు. కానీ కమర్షియల్ సక్సెస్ మాత్రం కాలేదు. థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా కాస్త ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చేసింది. అంతకు ముందు ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇక ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్ ఫాంపైకి ఆకస్మాత్తుగా వచ్చేసింది.

కేవలం ఆహాలోనే కాకుండా.. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రైమ్ వీడియోలో కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే విడుదలవుతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని కృషివ్ ప్రొడక్షన్, హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానర్స్ పై యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు.

ఇక కథ విషయానికి వస్తే.. ఇందులో హీరో నవీన్ చంద్ర (మధుసూధన్ రావు) ప్రభుత్వ ఉద్యోగిగా నటించాడు. ఉద్యోగం కోల్పోవడం.. భార్య లేఖ(కలర్స్ స్వాతి) వదిలిపోవడంతో మద్యానికి బానిసవుతాడు. కొన్నాళ్లకు మధుసూధన్ రావు జీవితంలోకి మధమతి (శ్రేయ నవేలి) అమెరికా నుంచి వస్తుంది. ఆ తర్వాత మధు జీవితం గురించి తెలుసుకుని.. వారిద్దరిని ఎలా కలిపిందనేది సినిమా. ఇప్పుడు ఈ మూవీ ఆహాలోనే కాదు.. అమెజాన్ ప్రైమ్ వీడియోలోను అందుబాటులో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.