AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: టీడీపీకి భారీ విరాళమిచ్చిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. ఎంతో తెలుసా?

కడప గడప వేదికగా టీడీపీ మహానాడు అట్టహాసంగా జరుగుతోంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో సహా పలువురు పార్టీ నాయకులు, శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నిర్మాత ఒకరు టీడీపీకి భారీ విరాళమిచ్చారు.

Tollywood: టీడీపీకి భారీ విరాళమిచ్చిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. ఎంతో తెలుసా?
Telugu Desam Party
Basha Shek
|

Updated on: May 29, 2025 | 2:10 PM

Share

ప్రతి ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ మహానాడును ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలా ఈ ఏడాది కూడా కడప గడప వేదికగా ఈ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో సహా పలువురు పార్టీ నాయకులు, శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహానాడు కార్యక్రమాల్లో భాగంగా, పార్టీకి విరాళాలు అందించిన దాతల పేర్లను పార్టీ చంద్రబాబు నాయుడు వేదికపై నుంచి చదివి వినిపించారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇలా చాలా మంది తమ పార్టీకి విరాళమిచ్చారు. అయితే ఈ జాబితాలో టాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ నిర్మాత పేరు ఉండడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అతను మరెవరో కాదు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య దేవర నాగవంశీ. మహానాడు సందర్భంగా టీడీపీకి నాగవంశీ పాతిక లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు స్వయంగా తెలిపారు.

ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూ జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నారు నాగ వంశీ. తన సితార సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై గతేడాది లక్కీ భాస్కర్ సినిమాను నిర్మించి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఈ ఏడాది ఇదే బ్యానర్ లో వచ్చిన మ్యాడ్ సీక్వెల్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఈ బ్యానర్ చేతిలో పలు కీలక ప్రాజెక్టులున్నాయి. ముందుగా విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా జులై 04 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అక్కినేని అఖిల్ లెనిన్, రవితేజ మాస్ జాతర, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజుతో పాటు సూర్య సినిమాలను కూడా నాగ వంశీ నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి..

OTT Movie: పౌర్ణమి రోజున రెచ్చిపోయే రక్త పిశాచి.. ఓటీటీలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడొద్దు

Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?

Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం

Hari Hara Veera Mallu: పవన్ హరి హర వీరమల్లులో మెరిసిన టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.