AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hello Meera: సినిమా మొత్తం ఒకే ఒక్క పాత్ర.. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హలో మీరా’ రిలీజ్ అప్పుడే..

గార్గేయి యల్లాప్రగడ ప్రధాన పాత్రలో హలో మీరా అనే సినిమా రాబోతుంది. సినిమా మొత్తంలో ఒకే ఒక పాత్ర ఉండబోతుంది. ఇలాంటి సినిమా తెరకెక్కించాలంటే మాత్రం ధైర్యం ఉండాల్సిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు దర్శకత్వం వహిస్తున్నారు.

Hello Meera: సినిమా మొత్తం ఒకే ఒక్క పాత్ర.. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'హలో మీరా' రిలీజ్ అప్పుడే..
Hello Meera
Rajitha Chanti
|

Updated on: Apr 01, 2023 | 9:41 PM

Share

సాధారణంగా ఒక సినిమాలో ఎన్నో రకాల పాత్రలు.. మరెన్నో విభిన్న కారెక్టర్లుంటాయి. ఒకే అంశం చుట్టూ ఉండే పాత్రలు ఎన్నో. దాదాపు రెండున్నర గంటల చిత్రం మొత్తం అందులో క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంటుంది. కానీ పరిమితమైన పాత్రలతోనూ అద్భుతాలు చేయొచ్చని ఇప్పటికే అనేకసార్లు నిరూపితమైంది. ఇప్పుడు తెలుగులోనూ అలాంటి ప్రయత్నం జరుగుతుంది. గార్గేయి యల్లాప్రగడ ప్రధాన పాత్రలో హలో మీరా అనే సినిమా రాబోతుంది. సినిమా మొత్తంలో ఒకే ఒక పాత్ర ఉండబోతుంది. ఇలాంటి సినిమా తెరకెక్కించాలంటే మాత్రం ధైర్యం ఉండాల్సిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకులు శ్రీబాబు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో.. డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు అన్నీ కూడా సోషల్ మీడియాలో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాగా..ఒకే ఒక్క పాత్రతో సినిమాను నడిపించడం.. ఎక్కడా ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా చిత్రీకరించడంపై ప్రశంసలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది.

ఇవి కూడా చదవండి

అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక పై ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ చిత్రానికి ఎస్. చిన్న సంగీతం అందించారు.

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..