Singer Sunitha: హీరోగా సింగర్‌ సునీత కుమారుడు.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌.. ‘తల్లీ కొడుకుల కల సాకారమైందంటూ’..

తేనె కన్నా తీయనైన స్వరంతో సంగీత ప్రియుల ప్రేమాభిమానాలు గెల్చుకుంది సునీత. ప్లే బ్యాక్‌ సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్‌ మోస్ట్‌ సింగర్‌గా వెలుగొందుతున్నారామె. ఇక తన వారసత్వాన్ని నిలబెడుతూ ఆమె పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

Singer Sunitha: హీరోగా సింగర్‌ సునీత కుమారుడు.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌.. 'తల్లీ కొడుకుల కల సాకారమైందంటూ'..
Singer Sunitha
Follow us
Basha Shek

|

Updated on: Jul 01, 2023 | 5:25 PM

తేనె కన్నా తీయనైన స్వరంతో సంగీత ప్రియుల ప్రేమాభిమానాలు గెల్చుకుంది సునీత. ప్లే బ్యాక్‌ సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్‌ మోస్ట్‌ సింగర్‌గా వెలుగొందుతున్నారామె. ఇక తన వారసత్వాన్ని నిలబెడుతూ ఆమె పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కుమార్తె శ్రేయ తల్లి బాటలోనే సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య నటించిన సవ్య సాచి సినిమాలో టిక్‌ టిక్‌ టిక్‌ అనే పాటను అద్భుతంగా పాడి అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా సునీత కుమారుడు ఆకాశ్‌ కూడా తెరంగేట్రం చేశాడు. అతను హీరోగా నటిస్తోన్న చిత్రం సర్కార్‌ నౌకరి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు గంగనమోని శేఖర్ డైరెక్ట్‌ చేస్తున్నాడు. 1980 నాటి జరిగిన కథాంశంతో తెరకెక్కిన సర్కార్‌ నౌకరి సినిమాకు సంబంధించి ఆకాశ్‌ ఫస్ట్‌ లుక్‌ తాజాగా రిలీజైంది. ఈక్రమంలో కుమారుడికి అభినందనలు తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశారు సునీత.

‘కంగ్రాట్స్‌ ఆకాశ్‌.. ఈరోజు ఒక కుమారుడితో పాటు తల్లి కల కూడా సాకారమైంది. ప్రపంచంతో నువ్వు పంచుకోనున్న కథను తెలియజేయడంతో పాటు. నటుడిగా ఎదగాలన్న కలను సాకారం చేసుకోవడం కోసం నువ్వు పడిన శ్రమ, యాక్టింగ్‌ పట్ల నీకున్న ఆసక్తి, నిబద్ధత, నీ త్యాగాలకు ఈ పోస్టర్‌ అద్ధం పడుతోంది. సినిమా పట్ల నీకున్న ఆసక్తిని ఈ ప్రపంచం త్వరలోనే చూడనుంది. నీకు అంతా మంచే జరగాలంటూ కోరుకుంటున్నా’ అని ఎమోషనల్‌ అయ్యారు సునీత. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు సునీతతో పాటు ఆమె కుమారుడికి విషెస్‌ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.