Singer Mangli: సింగర్ మంగ్లీ ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
కెరీర్ బిగినింగ్ లో న్యూస్ ఛానల్ లో యాంకర్ గా చేసి.. ఆ తర్వాత బతుకమ్మ పాటలతో ఫెమస్ అయ్యింది మంగ్లీ. ఆ తర్వాత ఫోక్ సాంగ్స్ తో అలరించింది.

టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ సింగర్స్ లో మంగ్లీ పేరు కూడా ఉంటుంది. తనదైన గాత్రంతో అద్భుతంగా పాటలు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మంగ్లీ. కెరీర్ బిగినింగ్ లో న్యూస్ ఛానల్ లో యాంకర్ గా చేసి.. ఆ తర్వాత బతుకమ్మ పాటలతో ఫెమస్ అయ్యింది మంగ్లీ. ఆ తర్వాత ఫోక్ సాంగ్స్ తో అలరించింది. జానపద గీతాలతో మంగ్లీకి మంచి పాపులారిటీ వచ్చింది. చిత్తూరు జిల్లా సుంకిడికి చెందిన మంగ్లీ అసలు పేరు.. సత్యవతి రాథోడ్. అయితే తెలంగాణలో మంగ్లీగా మారి తెలంగాణ యాసలో ఫోక్ సాంగ్స్ పాడుతూ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు అందుకుంది. మంగ్లీ పాడిన పాటలన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించింది మంగ్లీ. ఇక ఇప్పుడు హీరోయిన్ గా సినిమా చేయనుంది ఈ భామ.
మంగ్లీ హీరోయిన్ గా త్వరలోనే ఓ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే మంగ్లీ హీరోయిన్ గా సినిమా తెరకెక్కేది ఇక్కడ కాదట.. కన్నడ భాషలో అని తెలుస్తోంది. కన్నడ దర్శకుడు చక్రవర్తి చంద్రచూడ్ దర్వకత్వం వహిస్తున్న `పాదరాయ`ఈ సినిమాలో మంగ్లీ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మంగ్లీ ఒకొక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా..కెరియర్ స్టార్టింగ్ లో ఒక్కో పాట కోసం ఆమె పదివేలు 20వేల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకునేది. కానీ ఇప్పుడు స్టార్ డమ్ రావడంతో ఒక పాట కోసం లక్షకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది.




