AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Mohan: ‘ఏ మహిళ దగ్గర ప్రశాంతత దొరుకుతుందో..’ స్టార్ హీరో భార్యకు సింగర్ కౌంటర్

కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి) విడాకుల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం భార్య ఆర్తికి దూరంగా ఉంటోన్న ఈ హీరో శుక్రవారం (మే 09) ఓ పెళ్లి వేడుకలో సింగర్‌ కెనిషా ఫ్రాన్సిస్‌ కనిపించాడు.

Ravi Mohan: ‘ఏ మహిళ దగ్గర ప్రశాంతత దొరుకుతుందో..’ స్టార్ హీరో భార్యకు సింగర్ కౌంటర్
Ravi Mohan
Follow us
Basha Shek

|

Updated on: May 10, 2025 | 7:39 PM

కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ ఈ మధ్యన సినిమాల కంటే తన పర్సనల్ లైఫ్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. 15 ఏళ్లుగా కలిసి కాపురం చేసిన భార్య ఆర్తితో విడాకులు కావాలంటున్నాడీ హీరో. ఇద్దరు పిల్లలున్నారు.. ఒకసారి ఆలోచించుకోండంటూ ఫ్యామిలీ కోర్టు కౌన్సెలింగ్ ఇచ్చినా ఈ నటుడు విడాకులే కోరుకుంటున్నాడు. కాగా రవి మోహన్, భార్య ఆర్తి దంపతుల మధ్య మనస్పర్థలు రావడానికి ప్రముఖ సింగర్‌ కెనిషా ఫ్రాన్సిసే కారణమని ప్రచారం జరుగుతోంది. అయితే తాము మంచి స్నేహితులమని రవి మోహన్, కెనిషా ఇప్పటికే చెప్పుకొచ్చారు. కానీ శుక్రవారం జరిగిన ఓ పెళ్లి వేడుకలో మళ్లీ జంటగా కనిపించారు రవి మోహన్, కెనిషా. అందరి ముందు చెట్టాపట్టాలేసుకుని కలియ తిరిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలయ్యాయి. దీంతో సహజంగానే భార్య ఆర్తికి చిర్రెత్తు కొచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్ట్ పెట్టింది. జయం రవి, కెనిషా పేర్లు నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఇద్దరిపై షాకింగ్ ఆరోపణలు చేసింది. రవి మోహన్ తనని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని, పిల్లల్ని పట్టించుకోలేదని, అతను అసలు తండ్రేనా అంటూ హీరోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్తి పోస్ట్ కూడా నెట్టింట వైరలయ్యింది. చాలా మంది ఆమెకు మద్దతుగా కామెంట్స్ కూడా పెడుతున్నారు.

కాగా ఇప్పుడు ఆర్తికి కౌంటరిచ్చింది జయం రవి ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న సింగర్ కెనీషా. ఈ మేరకు తన ఇన్ స్టా స్టోరీలో నేరుగా ఆర్తి పేరు ప్రస్తావించకుండా.. ‘ఒక మగాడు ఎ‍ప్పుడూ ఎమోషన్స్ కి లొంగడు. ఏ మహిళ దగ్గర అయితే ప్రశాంతత ఉంటుందో వాళ్లకే తన హృదయాన్ని ఇస్తాడు. సైలెంట్ గా, మంచిగా ఉన్నాను కదా అని లైట్ తీసుకోకు. అదే నా నిజమైన బలం’ అనే కొటేషన్‌ ను షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

పెళ్లి వేడుకలో జంటగా రవి మోహన్, సింగర్ కెనీషా..  వీడియో ..

ప్రస్తుతానికి రవి మోహన్ వ్యవహారం కోలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఎవరిది తప్పు? ఎవరిది కరెక్ట్‌? అనేది తెలియాలంటే సదరు హీరో నోరు విప్పాల్సిందే.

రవి మోహన్ భార్య ఆర్తి ఫొటోస్..

View this post on Instagram

A post shared by Aarti Ravi (@aarti.ravi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాల్పుల విమరణలో ఎవరి పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!
కాల్పుల విమరణలో ఎవరి పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!
గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై HRC సీరియస్‌.. నోటీసులు జారీ!
గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై HRC సీరియస్‌.. నోటీసులు జారీ!
పార్క్‌ చేసిన బైక్‌పై అనుమానాస్పదంగా సంచి.. ఓపెన్ చేసి చూడగా షాక్
పార్క్‌ చేసిన బైక్‌పై అనుమానాస్పదంగా సంచి.. ఓపెన్ చేసి చూడగా షాక్
ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనట్లేదని వార్తలు.. బీసీసీఐ సంచలన ప్రకటన
ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనట్లేదని వార్తలు.. బీసీసీఐ సంచలన ప్రకటన
మన దేవాలయాల సంపదతో అమెరికా, చైనా దేశాల అప్పు కూడా తీర్చవచ్చట
మన దేవాలయాల సంపదతో అమెరికా, చైనా దేశాల అప్పు కూడా తీర్చవచ్చట
దాయాది దేశం కోసం ఏమైనా చేసే పిల్ల సైతాన్లు
దాయాది దేశం కోసం ఏమైనా చేసే పిల్ల సైతాన్లు
రిషబ్ అవుట్‌తో స్టేడియం విడిచి వెళ్లిన యజమాని! రియాక్షన్ వైరల్!
రిషబ్ అవుట్‌తో స్టేడియం విడిచి వెళ్లిన యజమాని! రియాక్షన్ వైరల్!
ఇంట్లో సిరిసంపదల కోసం రాత్రి నిద్రపోయే ముందు పాటించాల్సిన నియమాలు
ఇంట్లో సిరిసంపదల కోసం రాత్రి నిద్రపోయే ముందు పాటించాల్సిన నియమాలు
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి ఉంజల్ సేవ
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి ఉంజల్ సేవ
పొలాలకు వెళ్తున్న రైతులు.. బీ కేర్‌ఫుల్!
పొలాలకు వెళ్తున్న రైతులు.. బీ కేర్‌ఫుల్!