Singer Karthik: పాడుకోండిరా.. మీరే పాడుకోండి నేను పోతా.. సింగర్ కార్తీక్ ఫన్నీ వీడియో..
2010లో విడుదలైన కమర్షియల్గా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ మూవీ సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇటీవల రీరిలీజ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. ఈతరం జనరేషన్ ఆరెంజ్ సినిమాకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పటి యూత్ ఫేవరెట్ సినిమాగా నిలిచింది.
![Singer Karthik: పాడుకోండిరా.. మీరే పాడుకోండి నేను పోతా.. సింగర్ కార్తీక్ ఫన్నీ వీడియో..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/singer-karthik.jpg?w=1280)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రాల్లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అంటే ఆరెంజ్ మాత్రమే. 2010లో విడుదలైన కమర్షియల్గా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ మూవీ సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇటీవల రీరిలీజ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. ఈతరం జనరేషన్ ఆరెంజ్ సినిమాకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పటి యూత్ ఫేవరెట్ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్ యూత్ కు ఎక్కువగా కనెక్ట్ అయ్యాయి. సినిమా కంటెంట్ పక్కన పెడితే ఇందులోని పాటలకు అభిమానులు చాలా మంది ఉన్నారు. ఈసినిమా సాంగ్స్ ఎక్కడ వినిపించినా.. వెంటనే అవలీలగా పాడేస్తుంటారు చాలా మంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆరెంజ్ పాటలకు ఉన్న క్రేజ్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఇటీవల అమెరికాలో ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. ఇందులో స్టేజ్ పై ఉన్న కార్తీక్ ఆరెంజ్ సినిమా నుంచి చిలిపిగా చూస్తావేలా సాంగ్ పాడడం ప్రారంభించాడు. ఈ సాంగ్ స్టార్ట్ చేయగానే స్టేజ్ కింద ఉన్న అడియన్స్ ఈ పాటను పాడడం మొదలుపెట్టేశారు. దీంతో పాట పాడాల్సిన కార్తీక్ ఆశ్చర్యపోయాడు. వెంటనే మ్యూజిక్ ఆపాలంటూ వెనుక ఉన్న మ్యూజిక్ ప్లేయర్స్ వాళ్లకు సైగ చేశాడు. మీరు పాడుకోండి నేను చూస్తుంటా అన్నట్లుగా అక్కడే చేతులు కట్టుకుని నిలబడిపోయాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుండగా.. ఆరెంజ్ సాంగ్స్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
కార్తీక్ ఆరెంజ్ పాటలను పాడడం స్టార్ట్ చేసినప్పుడు అడియన్స్ కూడా పాడడం ఇది మొదటి సారి కాదు. గతంలో వైజాగ్ లో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్ లోనూ ఇదే జరిగింది. కార్తీక్ సాంగ్ పాడడం స్టార్ట్ చేయగానే స్టేజ్ కింద ఉన్న అడియన్స్ పాడడం స్టార్ట్ చేశారు. దీంతో సాంగ్ పాడడం ఆపేసి చూస్తూ ఉండిపోయాడు కార్తీక్.
Padatam apesadu 😂😂🤣
Orange Songs are always Lubbb ♥️#RamCharan pic.twitter.com/YRyiXnuGT2
— 𝐏𝐫𝐢𝐲𝐚𝐡 🐼 (@PriyaRC_4) June 18, 2024
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.