Anushka Shetty: వై స్వీటీ.. వై.. రూ.5 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణమదేనా ?..
గ్లామర్ రోల్స్ తో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ బ్యూటీ.. ఇటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నటిగా తనను తాను ప్రూన్ చేసుకుంది. అరుంధతి సినిమాతో జేజమ్మ తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ జోడిగా నటించిన బాహుబలి సినిమాలో అనుష్క యాక్టింగ్ చెప్పక్కర్లేదు. దేవసేన పాత్రలో అనుష్క నటన అద్భుతం.

సాధారణంగా కొందరు హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఆ భామల క్రేజ్ మాత్రం ఎప్పటికీ మారదు. అసలు సినిమాలు చేయకపోయినా ఆ ముద్దుగుమ్మలకు ఓ రేంజ్ పాపులారిటీ ఉంటుంది. అలాంటి వారిలో హీరోయిన్ అనుష్క ఒకరు. సూపర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. గ్లామర్ రోల్స్ తో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ బ్యూటీ.. ఇటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నటిగా తనను తాను ప్రూన్ చేసుకుంది. అరుంధతి సినిమాతో జేజమ్మ తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ జోడిగా నటించిన బాహుబలి సినిమాలో అనుష్క యాక్టింగ్ చెప్పక్కర్లేదు. దేవసేన పాత్రలో అనుష్క నటన అద్భుతం.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంటుందనుకున్నారు. కానీ అసలు సినిమాలు ఉన్నట్లుండి సైలెంట్ అయ్యింది. చాలా కాలం గ్యాప్ తీసుకున్న అనుష్క.. ఇటీవల నవీన్ పోలిశెట్టి సరసన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో మరోసారి క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం అనుష్క క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క ఓ భారీ ప్రాజెక్టును రిజెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
స్టార్ డైరెక్టర్.. స్టార్ హీరో కాంబోలో భారీ బడ్జెట్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారట. అందులో అనుష్కను కథానాయికగా ఎంపిక చేయగా ఆమె సున్నితంగా తిరస్కరించారని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదని.. కేవలం గ్లామర్ కోసమే అనుష్కను ఎంపిక చేశారని.. అందుకే ఈ ప్రాజెక్టు ఆఫర్ కాదన్నదని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి దాదాపు రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పినా అనుష్క ఒప్పుకోలేదట. అయితే దీనిపై అఫీషియల్ క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అనుష్క నటిస్తే చూడాలని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




