Tollywood: బాలకృష్ణుడు అభిమానుల గుండెల్లో దేవుడు.. ఇప్పుడు జనం కోసం రాజకీయాల్లోకి వచ్చిన హీరో.. ఎవరో తెలుసా..?
అతడి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ఈ హీరో సినిమాలు వస్తే థియేటర్లలో ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. బాలనటుడిగా కెరీర్ ఆరంభించి మూడు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నారు. 48 ఏళ్ల వయసులో కూడా 27 ఏళ్ల యువకుడిగా ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తూ కుర్రహీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు.

ఇటీవల స్టార్ హీరో-హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన తారల చైల్డ్ హుడ్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న బాలకృష్ణుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ కుర్రాడికి దేశంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ఈ హీరో సినిమాలు వస్తే థియేటర్లలో ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. బాలనటుడిగా కెరీర్ ఆరంభించి మూడు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నారు. 48 ఏళ్ల వయసులో కూడా 27 ఏళ్ల యువకుడిగా ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తూ కుర్రహీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు. తమిళంలో స్టార్ డమ్ ఉన్న ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు అతడు నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. అతడు ఎవరో గుర్తుపట్టే ఉంటారు కదా.. మీరు అనుకున్నది నిజమే.. ఆ బాలకృష్ణుడు మరెవరో కాదు.. దళపతి విజయ్.
విజయ్ జూన్ 22, 1974న జన్మించాడు. రేపు విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోస్, త్రోబ్యాక్ పిక్చర్స్ షేర్ చేస్తూ ఇప్పుడే నెట్టింట సంబరాలు స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. విజయ్ తల్లిదండ్రులు ఇద్దరూ సినీ నేపథ్యం ఉన్నవారే. 90వ దశకంలో విజయ్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చినా విజయ్ స్టార్ స్టేటస్ రావడానికి ఏళ్లు పట్టింది. 1996లో విడుదలైన ‘పూవే ఉనకాకే’ సినిమా విజయ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. విజయ్ ను అభిమానులు ముద్దుగా దళపతి అని పిలుచుకుంటారు. తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు విజయ్. ఒక్క సినిమాకు రూ.200 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం.
కానీ విజయ్ పారితోషికం ఇంకా 200 కోట్లకు చేరుకోలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల వారసుడు సినిమాకు రూ.125 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ మూవీ హిట్ తర్వాత విజయ్ తన రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ప్రశాంత్, అజ్మల్ అమీర్ కూడా నటిస్తున్నారు. ఇది టెమ్ ట్రావెల్ ఫిల్మ్ అని సమాచారం. ఇక విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్.. త్వరలోనే ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.