AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yesha Nagula Song: యూట్యూబ్‏లో సంచలనం.. ఏషనాగుల, ఆయా షేర్ పాటలకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో మారుమోగుతున్న పాటలు చాలా ఉన్నాయి. అందులో ఏషనాగుల సాంగ్ ఒకటి. మొన్నటి వరకు ఆయా షేర్ సాంగ్ సంచనలం సృష్టించగా.. ఇప్పుడు ఏషనాగుల పాట దుమ్మురేపుతుంది. ది ప్యారడైజ్ చిత్రంలో నాని, కీర్తి సురేష్ కలిసి చేసిన ఈ పాటకు నెట్టింట విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇంతకీ ఈ పాటను పాడిన సింగర్ ఎవరు.. అసలు అతడికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసుకుందామా.

Yesha Nagula Song: యూట్యూబ్‏లో సంచలనం.. ఏషనాగుల, ఆయా షేర్ పాటలకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..
Singer Jangireddy
Rajitha Chanti
|

Updated on: Sep 13, 2026 | 3:43 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై మంచి హైప్ నెలకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ యూట్యూబ్, సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. మొన్నటి వరకు ఆయా షేర్ సాంగ్ మిలియన్ వ్యూస్ అందుకుంటూ దూసుకుపోయింది. ఇక ఇప్పుడు ఏషనాగుల కట్టమీద పాట సంచలనం సృష్టిస్తుంది. అయితే ఈ పాటను పాడిన సింగర్ ఎవరు..? అతడికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసుకుందామా. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ.. “యూట్యూబ్‌లోనే ఈ పాటలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి కదా, మరి వీటి కోసం మీకు రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు? దాదాపు రూ. 5 లక్షల వరకు ఇచ్చి ఉంటారా?” అని ప్రశ్నించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న దండుపాళ్యం బ్యూటీ.. ఆమె ఇన్ స్టా చూస్తే..

దీనికి సింగర్ జంగి రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఆ పాటల ద్వారా లభించిన విజయం , ప్రజాదరణ ముందర తనకు వచ్చిన రెమ్యూనరేషన్ డబ్బులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయని తెలిపారు. పాటల సక్సెస్ చూస్తుంటే ఆ ఆనందంలో రెమ్యూనరేషన్ విషయాన్ని అస్సలు పట్టించుకోవాలనిపించడం లేదని అన్నారు. రూ. 5 లక్షల రెమ్యూనరేషన్ పై వస్తున్న అంచనాల గురించి మాట్లాడూతూ, “అంత స్థాయిలో పారితోషికం ఉండకపోవచ్చు కానీ, రెండు పాటలకు కలిపి నా కష్టానికి తగిన రీతిలోనే నిర్మాతలు పారితోషికం చెల్లించారు” అని స్పష్టం చేశారు. తాను పడ్డ కష్టానికి తగ్గ మంచి ఫలితం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని, ఎలాంటి అసంతృప్తి లేదా ఫిర్యాదులు లేవని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి :  Serial Song : పేరుకే సీరియల్ సాంగ్.. కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసిన పాట ఇది.. ఇప్పటికీ యూట్యూబ్‏లో తగ్గని డిమాండ్..

డబ్బు కంటే కూడా పాటల ద్వారా ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, గుర్తింపు మాత్రమే గాయకుడికి అసలైన సంతృప్తిని ఇస్తాయని ఈ సంభాషణ ద్వారా మరోసారి నిరూపితమైంది. ‘ఏష నాగుల’, ‘ఆయా షేర్’ పాటల విజయం తన సంగీత ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: సినిమా మొత్తం హీరో ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు.. హిట్టు కాదన్నారు.. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి..

ఏశనాగుల కట్టమీద సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‏కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

Follow Us