AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Song : కుర్రాళ్లు ఇప్పటికీ పాడుకునే సీరియల్ సాంగ్.. యూట్యూబ్‏ను షేక్ చేసింది.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

సాధారణంగా సినిమా పాటలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ మీకు తెలుసా.. ఒకప్పుడు ఒక సీరియల్ సాంగ్ కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఈ పాట క్రేజ్ తగ్గడం లేదు. ముఖ్యంగా యువతకు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. ఇక లిరిక్స్ సంగతి చెప్పక్కర్లేదు. ఇంతకీ ఈ పాటను మీరు విన్నారా.. ? వింటే పాడుతూనే ఉంటారు.

Serial Song : కుర్రాళ్లు ఇప్పటికీ పాడుకునే సీరియల్ సాంగ్.. యూట్యూబ్‏ను షేక్ చేసింది.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
Chakravakam Song
Rajitha Chanti
|

Updated on: Sep 13, 2026 | 3:18 PM

Share

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాను సినిమా పాటలు, ఫోక్ సాంగ్స్ షేక్ చేస్తున్నాయి. ఎటు చూసిన ఏదోక పాట వినిపిస్తూనే ఉంటుంది. కానీ మీకు తెలుసా.. ఒకప్పుడు సీరియల్ సాంగ్ సంచలనం సృష్టించింది. ముఖ్యంగా 90’s కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది. ఇంతకీ ఈ పాట గురించి మీకు తెలుసా.. ? అయితే మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. తెలుగు బుల్లితెర చరిత్రలో కొన్ని ధారావాహికలు ఎప్పటికీ చెరగని ముద్ర వేసాయి. అలాంటి క్లాసిక్ సీరియల్స్‌లో ‘చక్రవాకం’ మొదటి వరుసలో ఉంటుంది. జెమిని టీవీలో ప్రసారమైన ఈ సీరియల్ నాటి కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాదు యువతను సైతం అట్రాక్ట్ చేసింది. అప్పట్లో ఈ సీరియల్ కేవలం ఫ్యామిలీ అడియన్స్ మాత్రమే కాదు.. యూత్ సైతం ఫాలో అయ్యేవారు. అయితే ఈ సీరియల్ కథ మాత్రమే కాదు, దీని టైటిల్ సాంగ్ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి.

ఎక్కువమంది చదివినవి : ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. చివరకు చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.. ప్రేమ కన్నీళ్లు..

సినిమా పాటలకు తగ్గని క్రేజ్

సాధారణంగా టీవీ సీరియల్ టైటిల్ సాంగ్స్ అంటే గృహిణులు, మహిళల అభిరుచులకు అనుగుణంగా ప్రశాంతంగా ఉంటాయి. కానీ మంజులా నాయుడు దర్శకత్వంలో వచ్చిన చక్రవాకం సీరియల్ టైటిల్ సాంగ్ “ఎందుకో నాకు ఈ ఆశలు..” మాత్రం పూర్తి భిన్నంగా రూపొందింది. బంటీ అందించిన సంగీతం, అలపించిన గానం ఈ పాటకు ప్రధాన బలమైనాయి. బలభద్రపత్రుని మధు రాసిన సాహిత్యం వినే ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Allari Naresh: అతడు ఒక కంప్లీట్ యాక్టర్.. డైలాగ్స్, ఫైట్స్ అన్నీ అద్భుతంగా చేస్తాడు.. అల్లరి నరేష్.

లవ్, ఎమోషన్స్ కలగలిపిన మెలోడీ ట్యూన్ కావడంతో నాటి కుర్రాళ్లకు ఈ పాట బాగా పిచ్చెక్కించేసింది. రేడియోలు, రింగ్‌టోన్లు, బైక్ ప్రయాణాల్లో ఈ పాట మార్మోగిపోయేది. ఈ రోజుల్లో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ విడుదలవుతున్నప్పటికీ, చక్రవాకం టైటిల్ ట్రాక్‌కు ఉన్న డిమాండ్ కొద్దిగా కూడా తగ్గలేదు. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ సాధిస్తూ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ముఖ్యంగా 90s మ్యూజిక్ లవర్స్ ఈ పాటను లూప్‌లో పెట్టి వింటుంటారు. సీరియల్ పూర్తయి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా, ఈ పాట వింటే వచ్చే ఆస్టాల్జిక్ ఫీల్ వేరే రేంజ్‌లో ఉంటుంది. కేవలం ఒక టీవీ సీరియల్ టైటిల్ సాంగ్ ఎవర్ గ్రీన్ చార్ట్‌బస్టర్‌గా నిలవడం నిజంగా అరుదైన విషయమే!

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఏడాదిలో 80 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్..

చక్రవాకం సీరియల్ సాంగ్..

ఎక్కువమంది చదివినవి : Brahmaji : అన్నం పెట్టిన ఋణం తీర్చుకోవడానికి ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు.. నటుడు బ్రహ్మాజీ..

Follow Us