AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmaji : అన్నం పెట్టిన ఋణం తీర్చుకోవడానికి ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు.. నటుడు బ్రహ్మాజీ..

నటుడు బ్రహ్మాజీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. నిన్నే పెళ్లాడతా సమయం నుండి ఆయన సినిమాలలో నటించాలనే కోరిక, సింధూరం, మురారి చిత్రాలతో మొదలైన బంధం, ప్రతి సినిమాలో తనకంటూ ఒక పాత్రను రాయడం వంటి అనేక విషయాలను పంచుకున్నారు. ఇది వారి మధ్య ఉన్న అంతులేని గౌరవం, వృత్తిపరమైన స్నేహాన్ని చాటుతుంది.

Brahmaji : అన్నం పెట్టిన ఋణం తీర్చుకోవడానికి ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు.. నటుడు బ్రహ్మాజీ..
Brahmaji
Rajitha Chanti
|

Updated on: Sep 11, 2026 | 11:20 AM

Share

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ దర్శకుడు కృష్ణవంశీతో తనకున్న ప్రత్యేకమైన, సుదీర్ఘ అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరంగా వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో, వారిద్దరి మధ్య ఉన్న వృత్తిపరమైన, వ్యక్తిగతమైన బంధం లోతును, పరస్పర గౌరవాన్ని బ్రహ్మాజీ ఆవిష్కరించారు. మహానుభావుడు అని కృష్ణవంశీని వర్ణించిన బ్రహ్మాజీ, ఆయన పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని తెలియజేశారు. కృష్ణవంశీని చూస్తే కోపం వస్తుందేమోనన్న భయం తనకు ఉండేదని, ఆయన అంటే తనకు చాలా ఇష్టమని బ్రహ్మాజీ తెలిపారు. నిన్నే పెళ్లాడతా సినిమా సమయంలోనే కృష్ణవంశీని తొలిసారి చూశానని, అప్పుడే ఆయనతో కలిసి పనిచేయాలని తీవ్రంగా కోరుకున్నానని బ్రహ్మాజీ వెల్లడించారు. తాను నటుడిగా స్థిరపడకముందు, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో, కృష్ణవంశీ రూమ్‌మేట్స్‌ తనకు స్నేహితులని, ఆ ద్వారా ఆయనకు పరిచయం అయ్యారని వివరించారు. కృష్ణవంశీ రూమ్‌కి వెళ్లాల్సి వస్తే, ఆయన అక్కడున్నారని తెలిస్తే వెళ్ళేవాడిని కాదని, ఆయన పట్ల ఉన్న గౌరవం, ఒక రకమైన ఆటోమేటిక్ భయం కారణంగా ఆ దూరం పాటించానని బ్రహ్మాజీ చెప్పారు. ఆ రోజు నుంచే కృష్ణవంశీ అంటే తనకు ఒక ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడిందని, ఆయన సినిమాలు చూసి చాలా ఇష్టపడేవాడినని, ఆయన సినిమాలలో నటించాలని తీవ్రంగా కోరుకునేవాడినని తెలిపారు.

తొలిసారిగా సింధూరం సినిమాకు కృష్ణవంశీ నుండి పిలుపు వచ్చిందని బ్రహ్మాజీ గుర్తుచేసుకున్నారు. సింధూరం కోసం బ్రహ్మానందం గారిని కూడా బ్రహ్మాజీ గురించి అడిగారని, “బ్రహ్మాజీ ఉన్నాడు కదా, సరిపోతాడు కదా, ఎందుకు సార్?” అని అడిగారని బ్రహ్మాజీ పేర్కొన్నారు. అసిస్టెంట్లు వచ్చి డేట్లు తీసుకున్నారని, అయితే తర్వాత వారే వచ్చి డేట్లు రద్దు చేశారని, అప్పుడు తనకు చాలా బాధ కలిగిందని తెలిపారు. అయితే, చాలా రోజుల తర్వాత కృష్ణవంశీ మురారి సినిమాలో తనకు అవకాశం ఇచ్చారని, ఆ నాటి నుండి వారి మధ్య ఒక ఇష్టం, ఒక స్నేహం ఏర్పడిందని బ్రహ్మాజీ వివరించారు.

సెట్‌లో ఉన్నప్పుడు తాము పెద్దగా మాట్లాడుకోమని, ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారని, తాను తన పని చేసుకుంటూ ఉంటానని బ్రహ్మాజీ చెప్పారు. కృష్ణవంశీ పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, వారి మధ్య ఒక కంఫర్ట్ లెవల్ ఉన్నప్పటికీ, అరాచకం చేసేంత క్లోజ్‌నెస్ లేదని, ఆ గౌరవాన్ని, ఆ దూరాన్ని ఇవ్వాలని బ్రహ్మాజీ స్పష్టం చేశారు. తాను సెట్‌లో ఉంటే కృష్ణవంశీకి ఒక ధైర్యం, ఒక కంఫర్ట్ ఉంటుందని తాను అనుకుంటానని బ్రహ్మాజీ అభిప్రాయపడ్డారు.

కృష్ణవంశీ తీసే ప్రతి సినిమాకు తనకు ఫోన్ చేసి పిలుస్తారని, ఒకవేళ డేట్స్ కుదరకపోతే, “నేనే చేయను” అని తాను చెబితే, “వద్దమ్మా, వేరే వాళ్ళతో చేస్తాను” అని ఆయనే అంటారని బ్రహ్మాజీ వెల్లడించారు. అయితే, కృష్ణవంశీ తీసే ప్రతి సినిమాకు తన గురించి ఒక వేషం రాసుకుంటారని, ఇది వారి బంధానికి గొప్ప నిదర్శనమని బ్రహ్మాజీ గర్వంగా తెలిపారు. ఆయనతో తాను చాలా సినిమాలు చేశానని, ఇటీవల రంగ మార్తాండ చిత్రంలో కూడా కలిసి పనిచేశానని బ్రహ్మాజీ పేర్కొన్నారు. తాను ఏదైనా ఒక టేక్‌లో చేసేస్తానని, ఎక్కువ టేక్‌లు తీసుకోనని, కృష్ణవంశీ కూడా ఎక్కువ టేక్‌లు ఇష్టపడరని, ఇది తమ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, బాండింగ్‌కి ఒక కారణమని బ్రహ్మాజీ వివరించారు.

Follow Us