Chinmayi Sripada: యంగ్ హీరో సినిమాతో నటిగా పరిచయం అవుతున్న అందాల సింగర్..
చిన్మయి శ్రీపాద.. సింగర్‌గా..డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నటిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Chinmayi Sripada: చిన్మయి శ్రీపాద.. సింగర్‌గా..డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నటిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన స్వీట్ వాయితో పాటలు పాడుతూ.. హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ.. పాపులర్ అయిన చిన్మయి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సమాజంలో జరిగే సమస్యలపై, అంశాలపైన స్పందిస్తూ ఉంటుంది. టాలీవుడ్ ప్రేక్షకులకు, కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమున్న చిన్మయి మీటూ ఉద్యమంలో భాగంగా తన గళాన్ని వినిపించింది. ఇక ఇప్పుడు నటిగా తనలో ప్రతిభను చాటుకోవడానికి రెడీ అవుతుంది. అక్కినేని అఖిల్ నటిస్తున్న సినిమాతో నటిగా పరిచయం అవుతుంది ఈ అందాల సింగర్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్న రాహుల్ రవీంద్రన్‌కి రీల్ వైఫ్‌గా నటిస్తున్నారట ఈ రియల్ వైఫ్. ఈ రోజున చిన్మయి పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా టీమ్ ఈ విషయాన్ని రివీల్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది.
అఖిల్ వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. చాలా కాలం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఇప్పుడు ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాపైనే పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అందమైన ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే గోపీ సుందర్ సంగీత సారధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మనసా పాట, ఆ తర్వాత వచ్చిన రెండు పాటలు, అలాగే టీజర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహన్ని తెచ్చింది. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :