Chinmayi Sripada: “ఆ సమయంలో మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యాను”.. ఎమోషనల్ అయిన చిన్మయి
తన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఆబాలగోపాలాన్ని అలరించారు సింగర్ చిన్మయి శ్రీపాద. చూడచక్కని రూపం.. అంతము మించి మాధుర్యంగా గాత్రం చిన్మయి సొంతం.

తన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఆబాలగోపాలాన్ని అలరించారు సింగర్ చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada). చూడచక్కని రూపం.. అంతము మించి మాధుర్యంగా గాత్రం చిన్మయి సొంతం. పాటలకు తన గొంతుతో ప్రాణం పొసే చిన్మయి.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. సమాజంలో జరిగే సంఘటనలపై.. ఆడవారిపై జరిగే అకృతయల పై చిన్మయి ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. ఇక ఈ అందాల సింగర్ నటుడు రాహుల్ రవీంద్రన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం 2014లో జరిగింది. ఇటీవలే ట్విన్స్ కు జన్మానించారు చిన్మయి. తాజాగా చిన్మయి తన ప్రగ్నెన్సీ జర్నీని అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియోలో తన ప్రగ్నెన్సీ గురించి ఆసక్తికర విషయాల్లాను పంచుకున్నారు. నేను నా భర్త ఇద్దరం ఏపాటి నుంచో పేరెంట్స్ అవ్వాలని అనుకున్నాం.. కానీ కరోనా కారణంగా మేము అయోమయంలో పడ్డం.. ఆసమయంలో నేను నా గైనకాలజిస్ట్ ను సంప్రదించాం.. బయట పరిస్థితులు బాలేవని ఇంకొంత సమయం తీసుకొమ్మని చెప్పారు అని తెలిపారు చిన్మయు. ఇక సెకండ్ వేవ్ అయినా తర్వాత నేను గర్భం దాల్చాను.. కానీ మూడునెలలకే అబార్షన్ అయ్యింది.. అప్పుడు చాలా బాధపడ్డాను. మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యాను. అని ఎమోషనల్ అయ్యారు చిన్మయి. ఆ సమయంలో నేను ఎవ్వరికి చెప్పలేదు. చాలా రోజులు ఆ విషయం గురించి మాట్లాడలేదు.. ఆతర్వాత చాలా మందిని కలిసి కొని విషయాలు తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను మళ్లీ గర్భం దాల్చా.. ఇప్పులేదు ట్విన్స్ కు జన్మనిచ్చా అని తన జర్నీని చెప్పుకొచ్చారు చిన్మయి.



